ఆంధ్రప్రదేశ్‌

కోస్ట్‌గార్డు వ్యవస్థ కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, ఏప్రిల్ 13: దేశ తీరప్రాంత రక్షణలో కోస్ట్‌గార్డు వ్యవస్థ అందిస్తున్న రక్షణ సేవలు చాలా కీలకమని, అతి తక్కువ కాలంలోనే కోస్ట్‌గార్డు అభివృద్ధి చెందిందని రాష్ట్ర పోలీసు శాఖ డిజిపి ఎన్ సాంబశివరావు అన్నారు. గురువారం కృష్ణపట్నం కోస్ట్‌గార్డు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా గస్తీ నౌక చార్లీ-423 నౌకను ఆయన రిమోట్ ద్వారా ప్రారంభించారు. కోస్ట్‌గార్డు ఐజి రాజన్ బర్గోత్ర, డిఐజి ఎకె హరబోలా సంయుక్తంగా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోస్ట్‌గార్డు సిబ్బంది నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పోర్టు సిఇఓ అనిల్ కుమార్ ఎండ్లూరి, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, జిల్లా ఎస్‌పి విశాల్ గున్నీ, రూరల్ డిఎస్‌పి తిరుమలేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎపి డిజిపి ఎన్ సాంబశివరావు చార్లీ గస్తీ నౌకను రిమోట్ ద్వారా ప్రారంభించారు. అంతకు ముందు వేదికపై ఆయన మాట్లాడారు. తీరప్రాంత పరిరక్షణలో గస్తీ నౌకల సేవలు చాలా కీలకమన్నారు. ఈ నౌక ఐదు వందల నాటికన్ మైలు తో ప్రయాణం చేస్తుందని, ఇప్పటికే కృష్ణపట్నం కోస్ట్‌గార్డుకు తీరప్రాంత రక్షణలో భాగంగా రెండు నౌకలు రాణి గైడిన్‌వ్యూ, ఆయూ ష్‌లు సేవలు అందిస్తున్నాయని చార్లీ- 423 గస్తీ నౌక రాకతో తీరంలో రక్షణ మరింత పటిష్టం కానున్నదని ఆయన తెలిపారు. ప్రైవేటు పోర్టుల్లో కృష్ణపట్నం పోర్టు గస్తీలో, రవాణా వ్యవస్థలో ముందుకు దూసుకెళుతుందని ఆయన తెలిపారు. అనంతరం కోస్ట్‌గార్డు ఐజి రాజన్ బర్గోత్రా మాట్లాడుతూ ఇప్పటికే కోస్ట్‌గార్డుకు అందుబాటులో రెండు నౌకలు తీరప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నాయని, ఈ నేపథ్యంలో చార్లీ గస్తీ నౌక రాకతో కోస్ట్‌గార్డు సేవలు విస్తృతం కానున్నాయని అన్నారు.

చిత్రం..కోస్ట్‌గార్డు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరింస్తున్న డిజిపి సాంబశివరావు