ఆంధ్రప్రదేశ్‌

వచ్చేది మా ప్రభుత్వమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 13: రెండేళ్లలో రాష్ట్రంలో ఏర్పడేది మన ప్రభుత్వమేనని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. కాబట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడవద్దన్నారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో జగన్ మాట్లాడుతూ పాలనలో, అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలమైందని అన్నారు. ప్రభుత్వం అవినీతి అక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, ఎవరికీ అన్యాయం జరిగినా సహించేది లేదన్నారు. ప్రతిపక్షాలు కాలుదువ్వితే చూస్తూ ఊరుకోమన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలకు తాగేందుకు గుక్కెడు నీరు లభించడం లేదన్నారు. అయినా ప్రభుత్వం ఎలాంటి ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. చీనీ, బొప్పాయి, అరటి, దానిమ్మ, నిమ్మతోటలు నీళ్లు లేక నిట్టనిలువునా ఎండుతున్నాయన్నారు. పంటలను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజితో ఏదో సాధించానని చంద్రబాబు గర్వంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రత్యేక హోదాకోసం వైకాపా రాజీలేని పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి