ఆంధ్రప్రదేశ్‌

అంబేద్కర్‌కు దండవేసే అర్హత బాబుకు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు దండ వేసే అర్హత లేదని వైకాపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ఆయనకు వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ యావ త్తు దళిత జాతిని కించపర్చిన చంద్రబాబుకు అంబేద్కర్‌కు నివాళి అర్పించే అర్హత లేదని అన్నారు. రాజ్యాంగ విధానాలకు విరుద్ధంగా ఎపిలో పాలన జరుగుతోందని విమర్శించారు.