ఆంధ్రప్రదేశ్‌

‘అత్యంత ముఖ్యమైన సమస్య ఏంటి?’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 16: ముఖ్యమంత్రి దృష్టికి నేరుగా తమ సమస్యలు తీసుకెళ్లేందుకు, పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం రూపొందించిన కైజాలా యాప్ ‘కనెక్ట్ ఎపి సిఎం’లో తాజాగా మరో ప్రశ్న సంధించారు. ఈ నెల 14న ఈ యాప్‌ను లాంఛనంగా ప్రారంభించగా, డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే ‘ప్రభుత్వ పనితీరు పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా?’ అంటూ తొలి ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు ‘సంతృప్తిగా ఉన్నాం.. పర్వాలేదు.. ఇంకా బాగా పనిచేయాలి.. బాగోలేదు’ అనే ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. తమ ఆప్షన్‌కు అనుగుణంగా అభిప్రాయాన్ని కింద టైప్ చేసి పంపాల్సి ఉంటుంది. సమాధానాన్ని ముఖ్యమంత్రి, లేదా ఆయన అనుమతించిన అధికారులు చూసి విశే్లషిస్తారు. అవసరమైన తదుపరి చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. యాప్‌ను ప్రారంభించాక రెండో ప్రశ్నగా ‘అత్యంత ముఖ్యమైన సమస్య ఏంటి’ అంటూ అడిగారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్టరైన వారు తాము ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లవచ్చు. అవినీతి, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై తమ అభిప్రాయాలను చెప్పవచ్చు. తమకు తీవ్ర ఇబ్బందిగా ఉన్న సమస్యను ఈ ప్రశ్నకు జవాబు ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లవచ్చు. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక అంశాలపై కూడా తమ అభిప్రాయాలు చెప్పే వీలుంది. ఇప్పటికే లక్ష డౌన్‌లోడ్లు, 4.3 రేటింగ్‌తో ఈ యాప్ ప్రజల్లో ఆసక్తి రేకెత్తిసోంది.