ఆంధ్రప్రదేశ్‌

పోలవరానికి అడ్డం పడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 16: సోమవారంను పోలవారంగా మార్చుకొని ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిచేస్తుంటే ఢిల్లీకి మూటలు మోసిన కెవిపి రామచంద్రరావు కేంద్ర మంత్రి ఉమాభారతికి లేఖలు రాయడం దుర్మార్గమని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు విమర్శించారు. ఆదివారం ఇక్కడి జలవనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కమీషన్లు కొట్టేయడం తప్ప ఔటుకు టనె్నల్ పూర్తవ్వకుండా జగన్ అడ్డుకున్నాడని, వచ్చే ఎన్నికల్లో పులివెందులలో ఆయన ఓటమి ఖాయమని హెచ్చరించారు. కొంతకాలంగా వైసిపి నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, విశే్వశ్వరరెడ్డి పోలవరం ప్రాజెక్టుపై రకరకాలుగా విమర్శలు చేస్తున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి పులివెందులకే ముఖ్యమంత్రి పీఠం అని పగటికలలు కంటున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌కి ఎక్కడికి వెళ్లినా ముఖ్యమంత్రి పదవి మీద ఉన్న పిచ్చితో ఏవేవో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. శాసనసభలో నాలుగుసార్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ప్రాజెక్టులపై మాట్లాడటం వినలేదన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఢిల్లీకి ముడుపులు చెల్లించిన కెవిపి రామచంద్రరావు పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారని, ప్రాజెక్టు జమాఖర్చులు వీరికి తెలియపరచాలంటున్నారని విమర్శించారు. వారి హయాంలో పోలవరం ప్రాజెక్టుకు రూ.540 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చారన్నారు. ఈ మూడేళ్ల కాలంలో తమ ప్రభుత్వం రూ.3,400 కోట్లు తెచ్చినట్లు ఉమ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తిచేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే జగన్, బొత్స, కెవిపి వేరే రాష్ట్రాల వారికి సహకరిస్తూ కేసులు వేయిస్తున్నారన్నారు. 2014 ప్రైస్ లెవల్‌కు అనుగుణంగా అంచనాలు పంపించమని కేంద్రం కోరిందన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచినట్లు బొత్స అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్ పులివెందుల వెళ్లి నీళ్లు లేక చీనీ చెట్లు ఎండిపోతున్నాయని అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. పోలవరం పవర్‌హౌస్‌ను కొట్టేయాలనే దుర్మార్గపు ఆలోచనతో 2009 నుంచి 2013 వరకు పనులు నిలిపివేశారని ఆయన ఆరోపించారు. దీనికి జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రతిపక్ష నాయకులకు ఇది తగదని, జరిగే అభివృద్ధిని గుర్తించాలని హితవు పలికారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకున్న సమయానికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తారని మంత్రి ఉమ స్పష్టం చేశారు.