ఆంధ్రప్రదేశ్‌

27, 28న విశాఖలో ఇంధన శాఖ జాతీయ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 16: విద్యుత్ రంగంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్రాల విద్యుత్ మంత్రుల జాతీయ సదస్సు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘2014కు ముందు అధఃపాతాళంలో ఉన్నాం. పరిశ్రమలకు వారంలో 3రోజులు అధికార ‘పవర్ హాలీడే’లు, ఇళ్లకు అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడిపోయేవాళ్లం. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు రాత్రనకా, పగలనకా పొలాల్లోనే పడిగాపులు కాసేవారు. చీకట్లో పాముకాటుతో ప్రాణాలు కోల్పోయేవారు. అర్ధరాత్రి పూట ఆకస్మికంగా వచ్చే విద్యుత్‌తో నానాఅవస్థలు పడేవారు. రాత్రివేళల్లో చిమ్మచీకట్లో కరెంటు వైర్లను తాకి షాక్‌కు గురై రైతులు చనిపోయారన్న వార్తాకథనాలు ప్రతిరోజూ పత్రికల్లో చూడడం పరిపాటిగా వుండేది. పత్రికల్లో ఈ కథనాలు చదివినప్పుడల్లా నా మనస్సు విలవిల్లాడిపోయేది’ అంటూ ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ‘రాష్ట్ర ప్రగతికి దర్పణం పట్టే పరిశ్రమలకు గడ్డుకాలం ఏమిటని బాధపడేవాడిని. వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డాయని మధనపడేవాడిని. రైతు ప్రాణాలు విడిచి, కుటుంబం ఛిద్రమైందని కలతచెందేవాడిని. ఇప్పుడు విద్యుత్ కష్టాలు ఒక పీడకలగా మిగిలిపోయాయి. విద్యుత్ కోతలు గత ప్రభుత్వ అసమర్ధతతకు ఆనవాళ్లుగా మిగిలిపోయాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘అదంతా గత చరిత్ర. ఇప్పుడు రాష్ట్రంలో 24గంటలూ నిరంతరం విద్యుత్‌ను పరిశ్రమలు, ఇళ్లు, వాణిజ్య వర్గాలకూ అందిస్తున్నాం. వ్యవసాయానికి 7 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. ఇంతటితో సంతృప్తి చెందేందుకు వీల్లేదు. ఇంకా అధిగమించాల్సిన విజయాలు చాలా ఉన్నాయి. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా శ్రమించాల’ని చంద్రబాబు చెప్పారు. ఈ నెల 27, 28 తేదీల్లో కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యఅతిథిగా పాల్గొనే రాష్ట్రాల విద్యుత్ మంత్రుల జాతీయ సమావేశంలో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల పనితీరు, పంపిణీ, సరఫరా నష్టాల తగ్గింపు అంశాలతో పాటు పొదుపు, సంరక్షణ విధానాల్లో దేశంలోనే మెరుగైన విధానాల అమలు గురించి ఇతర రాష్ట్రాలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దేశానికి రాష్ట్ర ఇంధన ప్రగతిని గురించి ‘షోకేస్’ చేయాలన్నారు. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెనువెంటనే విద్యుత్ వ్యవస్థపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఈ రంగంపై పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నారని ఇంధన శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావును ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఈసందర్భంగా రాష్ట్ర ఇంధన రంగం మరింత అభివృద్ధిని సాధించేలా తొమ్మిది అంశాలను ముఖ్యమంత్రి సూచించారు. తొలిసారి విశాఖలో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న రాష్ట్రాల ఇంధన శాఖ మంత్రుల జాతీయ సమావేశం ఏర్పాట్లు చేసేందుకు కేంద్ర ఇంధన శాఖ ఉన్నతాధికారులతో ఈపిడిసిఎల్ సిఎండి ఎంఎం నాయక్, విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సమన్వయం చేసుకుంటున్నారని ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ జి సాయిప్రసాద్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్, ఇంధన శాఖ సలహాదారు రంగనాథం, ట్రాన్స్‌కో జెఎండిలు దినేష్ పరుచూరు, ఉమాపతి, విద్యుత్ పంపిణీ సంస్థల సిఎండిలు ఎంఎం నాయక్, హెచ్‌వై దొర, ఇంధనశాఖ మీడియా సలహాదారు ఎ చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబు