ఆంధ్రప్రదేశ్‌

కాఫీ తాగి వెళ్లిపోనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 17:‘మీ ధోరణి చూస్తుంటే ఇక్కడకు వచ్చి కప్పు కాఫీ తాగి, మిమ్మల్ని మెచ్చుకుని వెళ్లిపోవాలేమోనని అన్పిస్తోంద’ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు చురకలు వేశారు. ప్రధాన పనులు మినహా మిగిలినచోట్ల ఆ వేగం కన్పించటం లేదంటూ కాంట్రాక్టు ఏజన్సీలకు కూడా అక్షింతలు వేశారు. రోజువారీ కార్యాచరణను నిర్దేశించుకుని దానికి తగ్గట్టుగా ముందుకు వెళితేనే ఫలితం ఉంటుందని, వాస్తవిక దృక్పథం అవసరమని అధికారులు, కాంట్రాక్టు ఏజన్సీలకు హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి సోమవారం ఇక్కడకు వచ్చిన ముఖ్యమంత్రి ప్రాజెక్టు పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్, గేట్ల నిర్మాణం, స్పిల్‌వే పనులను పరిశీలించారు. అనంతరం అధికారులు, కాంట్రాక్టు ఏజన్సీలతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా అధికారులు చెబుతున్న పలు అంశాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కొంత అసహనానికి గురయ్యారు. ‘మిమ్మల్ని చూస్తుంటే పనులైతే మీ మహిమ, లేకుంటే మరొకరివల్ల సమస్య’ అన్నట్లుగా కనిపిస్తోందని, ఇది సరైన విధానం కాదని స్పష్టం చేశారు. ఇలాఅయితే తాను ఇక్కడకు వచ్చి కప్పు కాఫీ తాగి, మెచ్చుకుని వెళ్లిపోతే సరిపోతుందని, సమీక్షలు ఎందుకని ఇరిగేషన్ ఉన్నతాధికారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే కాంట్రాక్టు ఏజన్సీలకు కూడా అక్షింతలు తప్పలేదు. ప్రధాన పనులు ముందుకు సాగుతున్నా అదేస్ధాయిలో మిగిలిన పనులు ఎందుకు ముందడుగు పడటంలేదని ముఖ్యమంత్రి వారిని ప్రశ్నించారు. దీనికి వారు పలువిధాల వివరణ ఇవ్వడానికి ప్రయత్నించటంతో మరోసారి అసహనానికి గురైన ముఖ్యమంత్రి మీ వ్యవహారం చూస్తుంటే చెక్ ఇచ్చేస్తే పని అయిపోయినట్లేనన్నట్లుగా కన్పిస్తోందని వ్యాఖ్యానించారు. ఈమొత్తం పరిణామాలు చూస్తుంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నతీరులో మీ వ్యవహారం ఉందని, ఇది ఎంతమాత్రం సరికాదని చంద్రబాబు స్పష్టంచేశారు. డయాఫ్రమ్ వాల్, గేట్ల తయారీ పనులు వేగంగా జరగడాన్ని ఆయన ప్రస్తావిస్తూ మిగిలిన పనులు అనుకున్న స్థాయిలో జరగకపోవడాన్ని తప్పుపట్టారు. అయితే నిధుల కొరత ఉందని, బ్లాస్టింగ్ మెటీరియల్ పూర్తిస్థాయిలో సరఫరా లేదని, నైపుణ్యం ఉన్న వర్కర్ల కొరత ఉందని అధికారులు, ఏజన్సీ ప్రతినిధులు చెప్పగా గత నెలలోనే నిధులు విడుదలచేసినా ఎందుకు ఏజన్సీలకు చెల్లించలేదని, అలాచేయటం వల్ల పనులు ఆగిపోయే పరిస్థితి వస్తుందని చంద్రబాబు అన్నారు. వచ్చే సమావేశానికి ఇటువంటివి తాను వినకూడదని అధికారులను ఉద్దేశించి అన్నారు.

చిత్రం...పోలవరం పనులపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు