ఆంధ్రప్రదేశ్‌

వైకాపా గూటికి శిల్పా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఏప్రిల్ 18: కర్నూలు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి వైకాపాలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక టికెట్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి స్పష్టమైన హామీ రానందున వైకాపాలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారడంపై ఇప్పటికే తన అనుచరులకు మోహన్‌రెడ్డి చూచాయగా తెలిపినట్లు సమాచారం. శిల్పాను పార్టీలో చేర్చుకునేందుకు వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శిల్పా మోహన్‌రెడ్డి పార్టీ మారడంపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నిక సమీపిస్తున్న కొద్దీ జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. భూమా నాగిరెడ్డి మరణానంతరం ఆయన కూతురు అఖిలప్రియకు మంత్రి పదవి దక్కడం, నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో పార్టీ టికెట్ కేటాయింపుపై అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో తన అనుచరులు, శ్రేయోభిలాషులతో శిల్పా మంతనాలు జరిపారు. నంద్యాల శాసనసభ ఉప ఎన్నిక టిడిపి టికెట్ తమ నాయకుడికే ఇవ్వాలని, లేనిపక్షంలో తమదారి తాము చూసుకుంటామని శిల్పా అనుచరులు పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. తనకు టికెట్ ఇస్తామని అధిష్టానం నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారం రాకపోవడంతో పార్టీ మారేందుకు శిల్పా మోహన్‌రెడ్డి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాకు చెందిన తమ సమీప బంధువైన మాజీమంత్రి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేస్తున్న మరో వైకాపా నాయకుడి ద్వారా జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పించినట్లు సమాచారం. నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డిని నిలబెట్టడం ద్వారా పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పార్టీ మారడం వల్ల టిడిపిలో తనకు ప్రాధాన్యత తగ్గుతుందని, రాజకీయంగా ఎదురుదెబ్బ తినాల్సివస్తుందని జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి తన సోదరుడు శిల్పా మోహన్‌రెడ్డిని బుజ్జగించినట్లు సమాచారం. అయినా మోహన్‌రెడ్డి వెనకడుగు వేయలేదని తెలుస్తోంది. దీంతో సోదరుల మధ్య విభేదాలు తలెత్తాయని నంద్యాల టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీగానే కాక జిల్లా టిడిపి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ తమ వర్గం వారి ఓట్లు వేయించి ఎమ్మెల్సీగా చక్రపాణిరెడ్డిని గెలిపించేందుకు చేసిన కృషిని శిల్పా మోహన్‌రెడ్డి విస్మరించి పార్టీ మారితే అధిష్టానం చక్రపాణిరెడ్డికి ఇచ్చిన హామీ విషయంలో వెనక్కుతగ్గే సూచనలు ఉన్నాయని, పైగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి కూడా ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని సీనియర్ రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.