కృష్ణ

బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణాపై కఠినమైన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (లీగల్), ఏప్రిల్ 18: బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పిఆర్ రాజీవ్ అన్నారు. మంగళవారం స్థానిక ఈశ్వర్ రెసిడెన్సీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మహిత ప్లాన్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాలల ఆక్రమణ రవాణాపై వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పిఆర్ రాజీవ్ మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల బాలికల అక్రమ రవాణా చట్టరీత్యా నేరాలన్నారు. ఇటువంటి నేరాలకు పాల్పడే వారు, ప్రోత్సహించే వారిపై చట్టపరంగా కఠినంగా శిక్షలు ఉంటాయన్నారు. బడి ఈడు పిల్లలకు ఈ చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అవగాహనతోనే ఇటువంటి సమస్యలను ఎదుర్కోవచ్చన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే తమకు గానీ, ఐసిడియస్ అధికారులకు గానీ సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో మహిత ప్లాన్ ఇండియా సంస్థ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గోడే ప్రసాద్, ఐసిడియస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.