ఆంధ్రప్రదేశ్‌

దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 20: నమ్మకంగా ఒకరికి ఇచ్చిన రూ.14 లక్షల బాకీ వసూలు కాకపోవడంతో మనస్తాపానికి గురైన దంపతులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక అశ్వారావుపేట రోడ్డులో కార్తికేయ ఎంటర్‌ప్రైజస్ పేరిట ఆటోమొబైల్ షాపు నిర్వహిస్తున్న చిక్కాల సీతారామరాజు అలియాస్ రాజా (44) తన భార్య చిక్కాల శ్రీదేవి (40)తో కలిసి కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆటోమొబైల్ షాపునకు సమీపంలో, గోపాలకృష్ణ పెట్రోలు బంకు వెనుక నివాసం ఉంటున్న రాజా, శ్రీదేవి దంపతులు ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చి గురువారం ఉదయం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అదే వీధిలో శ్రీ రామచంద్ర ఎస్టేట్స్‌లో నివసిస్తున్న రాజా తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, శ్రీ షిరిడీ సాయిబాబా స్థూపం వద్దకు వెళ్ళి వస్తామని చెప్పారు. తరువాత కొద్దిసేపటికి మళ్లీ తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులతో మాట్లాడుతూనే రాజా స్పృహ తప్పిపడిపోయాడు. కొద్దిసేపటికే భార్య శ్రీదేవి కూడా పడిపోయింది. దీంతో చుట్టు పక్కల వారి సహాయంతో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా వారిద్దరూ విషం తీసుకున్నారని వైద్యుడు నిర్థారించారు. వీరి పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌లో ఏలూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో భార్య శ్రీదేవి మృతిచెందిందని, ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ నుండి దించేసి, రాజాను ఏలూరులోని ఆంధ్ర ఆసుపత్రికి తీసుకు వెళ్ళారని తెలిపారు. చికిత్స చేస్తుండగానే రాజా మృతిచెందినట్టు తెలిపారు. ఇరువురి మృతదేహాలను స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై ఎం.కేశవరావు పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. కాగా ఆత్మహత్యలకు ముందుగా బుధవారం రాత్రి తాము ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నదీ వివరంగా ఒక లేఖ రాసి పడక గదిలో పెట్టారు. ఈ లేఖ ఆధారంగా పట్టణానికే చెందిన ఒక ప్రముఖుడు రాజా తల్లిదండ్రులకు రూ.14 లక్షల రూపాయల బాకీ చెల్లించాల్సి ఉంది.