ఆంధ్రప్రదేశ్‌

కరవు రహిత రాష్టమ్రే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఏప్రిల్ 20: రాష్ట్రాన్ని కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు నీరు ప్రగతి ఉద్యమాన్ని ప్రారంభించారని రాష్ట్ర అటవీ శాఖమంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. గురువారం ఒంగోలులో నీరు ప్రగతి ఉద్యమ కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీరు ప్రగతి కార్యకమాన్ని 90రోజులపాటు ఉద్యమ స్ఫూర్తితో చేపట్టేందుకు అధికారులు, ప్రజలు సహకరించాలన్నారు. నీటి సంరక్షణకోసం వాటర్‌షెడ్ పనులు ఇంకుడు గుంతలు, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి పనులు వేసవిలో 90రోజులపాటు చేపట్టాలన్నారు. వర్షపునీరు భూమిలోకి ఇంకిపోయే విధంగా చర్యలు తీసుకుని భూగర్భ జలాలు పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా చేసేందుకు ముఖ్యమంత్రి నదుల అనుసంధానం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం మొదటి దశ 2018నాటికి పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారన్నారు.