ఆంధ్రప్రదేశ్‌

ఉద్యమ స్ఫూర్తితో నీటి సంరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యమ స్ఫూర్తితో నీటి సంరక్షణ చర్యలు చేపట్టారని అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా సచివాలయం 5వ బ్లాక్‌లో గురువారం మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి సిఎం రాత్రి పగలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో రెండంకెల వృద్ధిరేటు సాధించామని, చక్కటి రాజధాని నిర్మించుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. 90 రోజులపాటు నీరు-ప్రగతి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జలవనరుల ప్రాజెక్టులు పూర్తిచేసి కరువు రహిత రాష్ట్రంగా రూపొందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఓ చరిత్రగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2018 నాటికి దీన్ని పూర్తిచేయాలని సిఎం పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. దీంతో కరువు తొలగిపోతుందన్నారు. 2018 నాటికి వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తిచేసి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి నీరందిస్తారని మంత్రి చెప్పారు.
నీటి సంరక్షణలో విద్యార్థులను, ప్రజాప్రతినిధులను అందరినీ భాగస్వాములను చేస్తున్నారుని, చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నారని, తద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. నదుల అనుసంధానం ప్రక్రియ మొదలుపెట్టి, పట్టిసీమ ద్వారా కృష్ణానదికి నీరు తరలించి వేల ఎకరాలు సాగులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ ప్రాజెక్టుని 18 నెలల్లో పూర్తిచేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి శిద్ధా చెప్పారు.