ఆంధ్రప్రదేశ్‌

సాగు పత్రాల గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 20: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు మిర్చియార్డులో రైతులకు క్వింటాల్ 15 వందల ప్రభుత్వ మద్దతుధరతో మిర్చి కొనుగోళ్లను మంత్రి ప్రత్తిపాటితో పాటు మార్కెటింగ్‌శాఖ కమిషనర్ మల్లికార్జునరావు గురువారం ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఇందుకోసం మార్కెట్‌యార్డు ఆవరణలో సాగు నమోదు సర్ట్ఫికెట్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు. పుల్లారావు మాట్లాడుతూ 8వేల ధరకు మించకుండా కొనుగోలుచేసే వారికే నిబంధనల ప్రకారం 20 క్వింటాళ్ల వరకు మద్దతుధర చెల్లిస్తామన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటుధర కల్పించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అయితే పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని ఒకే పంట వైపు మొగ్గు చూపితే రైతులు నష్టపోతారన్నారు. ప్రత్యామ్నాయ పంటలను కూడా సాగుచేయాలని సూచించారు. గత ఏడాది రాష్టవ్య్రాప్తంగా విస్తీర్ణం పెరగటంతో 12 లక్షల క్వింటాళ్ల మేర నిల్వలు పేరుకుపోయాయన్నారు. రైతులకు చేయూత నందించేందుకే నకిలీ కారం నిల్వలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. రైతులు సంబంధిత వ్యవసాయశాఖ అధికారుల వద్ద నుంచి సాగు సర్ట్ఫికెట్లు తీసుకుంటే నేరుగా వారి అకౌంట్లలోకే రాయితీ సొమ్ము జమ అవుతుందని తెలిపారు. తొలివిడతగా ప్రభుత్వం వంద కోట్ల మేర నిధులు మంజూరు చేసిందన్నారు. రైతులకు పంపిణీచేసే సబ్సిడీలలో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ఆన్‌లైన్ ద్వారా ఈ క్రాపింగ్ సర్ట్ఫికెట్లతో పాటు ఆధార్ అనుసంధానం చేసి సాగు సర్ట్ఫికెట్లను జమచేసిన రైతులకే పథకం వర్తిస్తుందని మార్కెటింగ్‌శాఖ కమిషనర్ మల్లికార్జునరావు వివరించారు. దళారుల ప్రమేయం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. వ్యాపారులు నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుంచి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చెల్లింపులు జరపాలన్నారు. మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ యార్డులో నిఘా కెమేరాలు ఏర్పాటు చేశామన్నారు. మార్కెటింగ్ సిబ్బంది రైతులకు సహకరించాలని ఆదేశించారు.
కాగా సాగు సర్ట్ఫికెట్లలో గందరగోళం నెలకొంది. వ్యవసాయశాఖ అధికారి సంతకంతో ధ్రువీకరణ పత్రం ఉంటేనే ప్రభుత్వ సబ్సిడీకి అర్హులు. అయితే కొందరు రైతులు పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా గ్రామ వీఆర్వోల వద్ద నుంచి సర్ట్ఫికెట్లు తీసుకువచ్చారు. వీటిని మార్కెటింగ్ సిబ్బంది నిరాకరించారు. కర్నూలు జిల్లాకు చెందిన 20 మంది రైతులు 6 లారీలతో మిర్చిని తరలించారు. ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని తెలియటంతో గిట్టుబాటు ధర వస్తుందని ఆశించారు. అయితే ఎఒ సర్ట్ఫికెట్ తప్పనిసరని అధికారులు తేల్చిచెప్పటంతో తిరిగి వెళ్లారు.