ఆంధ్రప్రదేశ్‌

ఏటా అనంతపురంలోనే పుట్టినరోజు జరుపుకొంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 20: అనంతపురం కరవు జిల్లా కారాదు.. ఇది పేద వాళ్ల జిల్లా కాకూడదు.. జిల్లాకు హంద్రీనీవా ద్వారా నీటిని తరలించి సస్యశ్యామలం చేస్తాం.. పరిశ్రమలు, వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి చేసి ప్రగతి దిశగా పయనింపజేస్తాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. తాను ప్రతి ఏటా తన జన్మదినాన్ని నిరాడంబరంగా అనంతపురం జిల్లాలోనే జరుపుకుంటానని అన్నారు. గురువారం అనంతపురం జిల్లా పామిడిలో ఏర్పాటు చేసిన నీరు-ప్రగతి ఉద్యమం బహిరంగ సభలో సిఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా తన 68వ జన్మదినాన్ని వేదికపై కేక్ కోసి పేదల మధ్య జరుపుకున్నారు. 2015లో జన్మదినాన్ని జిల్లాలోనే జరుపుకున్నానని, ఇది రెండోసారి అని గుర్తుచేశారు. వేదికపై ఉన్న మంత్రులు నారా లోకేష్, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, దేవినేని ఉమామహేశ్వరరావు, చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, విప్ యామినీబాల, ఎంపి జెసి దివాకర్‌రెడ్డి, కలెక్టర్ కోన శశిధర్, కొత్త కలెక్టర్ వీరపాండ్యన్, స్థానిక ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, సభకు హాజరైన అనంతపురం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.