ఆంధ్రప్రదేశ్‌

అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేల కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 23: తెలుగుదేశం పార్టీ నేతలు అవినీతితో సంపాదించిన సొమ్ముతోనే వైసిపి ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తూ వైసిపి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం ఆందోళన నిర్వహించారు. గుంటూరు నగరంలోని లాడ్జిసెంటర్‌లో గల రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి టిడిపి తీరుపై మండిపడ్డారు. చంద్రబాబుకు రాజ్యాంగమన్నా, ప్రజాస్వామ్యమన్నా గౌరవం లేదన్నారు. బాబు చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను ప్రజలు ఏవగించుకుంటున్నారని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం కాదు.. ఆయన రచించిన రాజ్యాంగ విలువలను బాబు పరిరక్షించాలన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో అన్నిరంగాలూ పతనావస్థకు చేరుకున్నాయన్నారు. ఒక పార్టీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలను మరో పార్టీలో చేర్చుకోవడమేనా ప్రజాస్వామ్యమంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో తాము బలంగా ఉన్నామని చెప్పేందుకే చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రజాకోర్టులో బాబుకు శిక్ష తప్పదని ఎమ్మెల్యేలు హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్త్ఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాల్గొన్నారు.