ఆంధ్రప్రదేశ్‌

దశలవారీగా డిపోలకు ఏసి బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న, అత్యాధునిక బస్సులను ప్రవేశపెడుతున్న ఎపిఎస్‌ఆర్‌టిసి.. తోటి రవాణా సంస్థల కంటే ముందంజలో ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇందులో భాగంగానే 100 ఎసి కరోనా బస్సులకు ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చిందన్నారు. తొలుత నగరానికి చేరుకున్న 15 బస్సులను మంత్రి అచ్చెన్నాయుడు సహచర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కల్సి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. వీటిలో 9 బస్సులు విజయవాడ-హైదరాబాద్, 4 బస్సులు విజయవాడ-బెంగుళూరు, రెండు బస్సులు విజయవాడ-చెన్నైల మధ్య నడుస్తాయని అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆర్టీసీ మాత్రం ప్రజా సంక్షేమం కోసం నడుస్తూ ప్రయాణికుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందన్నారు. నష్టాల బాటలో ప్రయాణిస్తున్నప్పటికీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే చార్జీలతో బస్సులు నడుస్తున్నాయని అన్నారు. సంస్థ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ ఎం.మాలకొండయ్య మాట్లాడుతూ సంస్థ నష్టాల నుంచి రోడ్డెక్కడానికి అందరం కలిసి కృషి చేద్దామంటూ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సహకారంతో సంస్థ అభివృద్ధి బాటలో పయనించగలదన్న ఆకాంక్ష వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు ఎవి రావు, జి.జయరావు, ఎ.కోటేశ్వరరావు, ఆర్.శశిధర్, విజయవాడ జోన్ ఇడి ఎన్.వెంకటేశ్వరరావు, రీజనల్ మేనేజర్ పిన్నమనేని రామారావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కరోనా బస్సులు ప్రారంభిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు