ఆంధ్రప్రదేశ్‌

నిస్వార్థంగా పని చేస్తున్నా నిందిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 24 గంటలు తాను శ్రమిస్తుంటే రచ్చబండలపై కూర్చొని కొందరు అదే పనిగా ఎందుకు దూషిస్తున్నారో ఏ మాత్రం అర్థం కావటం లేదు.. అసలు అంత కోపం నాపై ఎందుకోనంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వేదంతో అన్నారు. విజయవాడ రూరల్ మండలం గుంటుపల్లిలో ‘పరిష్కార వేదిక’ కాల్ సెంటర్ ప్రారంభ సభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ వైద్య భరోసా కింద లక్షా 50వేలు వరకు సాయం, నెలనెలా రేషన్, పెన్షన్లు, స్కాలర్‌షిప్‌లు పొందుతూ కూడా తనను ఎందుకు తిడుతున్నారో తెలియటం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నూటికి నూరు శాతం రేషన్ పంపిణీ, పెన్షన్లు మంజూరు జరిగింది. ఇందుకోసం శ్మశానాల నుంచి శవాలు కూడా వచ్చి లబ్ధి పొందాయంటూ ఎద్దేవా చేశారు. అయితే తాము పారదర్శకతతో చేస్తున్న విధానంలో పెన్షన్, రేషన్‌లో దాదాపు 10 శాతం, స్కాలర్‌షిప్‌లో 20 శాతం ఆదా జరుగుతున్నదని అన్నారు. అసలు నాలో ఏ మాత్రం స్వార్థం లేదు.. మంచి పేరు కోసం నీతివంతమైన, అవినీతి రహిత పాలన అందించేందుకు శ్రమిస్తున్నానని అన్నారు. సమాజంలో ఏ వ్యక్తి బాధపడకూడదు, పేదరికం లేని సమాజం కోసం ఆర్థిక అసమానతల తగ్గింపుకు కృషి చేస్తున్నానని అన్నారు. అందుకే కాల్‌సెంటర్‌కే కాదు నేరుగా తనకే తమ సాధకబాధలు, అవినీతి గురించి చెప్పుకోవచ్చన్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకం కింద గర్భధారణ సమయం నుంచి ప్రసవం పూర్తయి తల్లీ, బిడ్డను ఇంటికి పంపిస్తూ ఆరువేల రూపాయల విలువైన పౌష్టికాహార పదార్ధాలను అందిస్తున్నామన్నారు. అనారోగ్యం, ప్రమాదాలు లేదా సహజ మరణం ఏదైనా సరే.. దహన సంస్కారాల నిమిత్తం నేరుగా 30వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే యోచన చేస్తున్నానని అన్నారు.