ఆంధ్రప్రదేశ్‌

ఠారెత్తిసున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: రాయలసీమలో ఎండలు మండుతున్నాయి. శనివారం కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి వేళల్లో కూడా వేడి ఏ మాత్రం తగ్గకపోవటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. శనివారం కర్నూలు జిల్లాలో సగటున 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కర్నూలులో 44.4, నంద్యాలలో 44.3, ఆదోనిలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప నగరంలో 43.6 సెల్సియస్ డిగ్రీలు, అనంతపురంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. తాడిపత్రి మండలంలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో శనివారం వడదెబ్బకు ఐదుగురు మృతిచెందారు. ఖమ్మం జిల్లాలో వడదెబ్బకు గురై ముగ్గురు మృతి చెందారు. జూలూరుపాడు, కొణిజర్ల, కల్లూరు మండలాల్లో వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్ళి ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.
44 డిగ్రీలు దాటిపోతున్న ఉషోణ్రగతలు
ప్రకాశం జిల్లా నిప్పులకొలిమిగా మారింది. ఉదయం 9 గంటల నుండే భానుడు నిప్పుల వర్షం కురిపించడంతో జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 10గంటల నుండి ప్రజలు, వాహన చోదకులు బయటకు రావాలంటేనే భయపడ్డారు. గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డుస్ధాయిలో శనివారం 44.7 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం 40.2సెంటీగ్రేడ్‌కే జిల్లాలోని ప్రజలు ఆందోళన చెందగా ఒక్కసారిగా నాలుగున్నర డిగ్రీలు పెరిగాయి. రానున్నరోజుల్లో ఎండలు మరింత మండే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా గత వారం రోజులుగా నెల్లూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి.
వడగాడ్పులకు నలుగురు మృతి
గుంటూరు: గుంటూరు జిల్లాలో శనివారం వడగాడ్పులకి నలుగురు మృత్యువాత పడ్డారు. అచ్చంపేటలో పాత చౌడమ్మ (80),అమరావతిలో రిక్షా కార్మికుడు షేక్ మస్తాన్ (60), మాచర్ల పట్టణంలో కార్పెంటర్ మనె్నం మస్తాన్‌రావు( 65), అర్వపల్లికి చెందిన వ్యవసాయ మహిళా కూలీ నెల్లూరి విజయలక్ష్మి (45) వడదెబ్బకు గురై మృతి చెందారు.