రాష్ట్రీయం

505.90 అడుగులకు సాగర్ నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, ఏప్రిల్ 22: నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం శనివారం సాయంత్రానికి 505.90 అడుగులకు చేరుకుంది. ఇది 124.60 టిఎంసీలతో సమానం. కృష్ణాడెల్టా, హైదరాబాద్ వాసుల తాగునీటి అవసరం నిమిత్తం శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఉత్తర్వుల మేరకు శ్రీశైలం కుడి గట్టు ద్వారా మూడు వేల క్యూసెక్కులు, క్రస్టు గేట్ల ద్వారా 14 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం కుడిగట్టులో విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 800.50 అడుగులకు చేరుకుంది. ఇది 29.2 టిఎంసీలతో సమానం.