ఆంధ్రప్రదేశ్‌

టిడిపి నేతలకు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: విజయవాడలో గత నెలలో టిడిపి నేతలు రవాణా శాఖ అధికారులపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 25వ తేదీన ఈ కేసును విచారించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షామీమ్ అక్తర్ నిర్ణయించింది. పత్రికల్లో ప్రముఖంగా చోటు చేసుకున్న ఈ వార్తను సుమోటోగా హైకోర్టు స్వీకరించింది. విజయవాడ ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, సిటీ మేయర్ కోనేరు శ్రీ్ధర్, ఏపి పోలీసుహౌసింగ్ బోర్డు చైర్మన్ ఎస్‌కె నాగుల్ మీరా, ఇతరులు రవాణా శాఖ కమిషనర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యం, అతని భద్రతా సిబ్బంది, ఆఫీసు సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వారిని దుర్భాషలాటినట్లు అభియోగాలు వచ్చాయి. ఈ ఘటన విజయవాడలో మార్చి 27వ తేదీన జరిగింది.