ఆంధ్రప్రదేశ్‌

తుని అల్లర్లపై దర్యాప్తు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 23: ఈ ఏడాది జనవరి 30వ తేదీన తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపుల ఐక్య గర్జన సభలో జరిగిన దురదృష్టకర సంఘటనలకు సంబంధించి కేసు విచారణను సిఐడి వేగవంతం చేసింది. తుని హింసకు బాధ్యులైన నిందితులను 10-15 రోజుల్లో అరెస్టులకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దుర్ఘటన సమయంలో ఆయా హింసాత్మక ప్రదేశాల్లో సుమారు 300 మంది ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. అయితే సుమారు 100 మందిని నిందితులుగా గుర్తించినట్టు తెలిసింది. కాపుల ఐక్య గర్జన సందర్భంగా తుని బహిరంగ సభ వద్ద అల్లరిమూకలు విధ్వంసాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. దుర్ఘటనలో రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు దగ్ధం కాగా అనేక పోలీసు వాహనాలు, ప్రైవేటు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. రెండు పోలీస్ స్టేషన్లు దగ్ధం కాగా, ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దుర్ఘటన అనంతరం ఒకవైపు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, మరోవైపు రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం సిఐడికి విచారణ బాధ్యతలు అప్పగించింది. అంతకు ముందే విధ్వంసానికి బాధ్యులైన వారి వివరాలను పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సహా సామాజిక మాథ్యమాల ద్వారా పోలీసులు సేకరించారు. సోషల్ మీడియాలో వరుసగా కథనాలు, రౌడీమూకల వివరాలు ఫొటోలతో సహా వెల్లడికావడంతో వాటిని కూడా పోలీసులు సేకరించారు.
విచారణలో భాగంగా ఆ వివరాలన్నిటినీ సేకరించి, జిల్లాల వారీగా నిందితుల వివరాల చిట్టాను సిఐడి సిద్ధం చేసినట్టు తెలిసింది. అలాగే ఘటనా సమయంలో తుని ప్రాంతంలో గల సుమారు 50సెల్ టవర్స్ ద్వారా వెళ్లిన కాల్స్ వివరాలను సిఐడి సేకరించినట్టు తెలిసింది. తుని ప్రాంతంలో ఘటనా సమయంలో సెల్‌ఫోన్స్ ఉపయోగించిన ప్రతి ఒక్కరి కాల్స్‌డేటాను పరిశీలిస్తుండటం విశేషం. అలాగే ఘటన సమయంలో పలువురు రైలు ప్రయాణికులకు చెందిన ఫోన్లు గల్లంతు కాగా, తర్వాత వాటిని కాజేసిన వారు వాటిని తిరిగి వాడినట్టు రూఢీ అయ్యింది. దొంగిలించిన సెల్‌ఫోన్స్ వాడిన వారి వివరాలను కూడా సేకరించినట్టు తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కోనసీమ ప్రాంతానికి చెందిన వారు నిందితుల్లో అధికంగా ఉన్నట్టు సమాచారం. అలాగే పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కడప జిల్లాలకు చెందిన వారు కూడా కాపుల ఐక్య గర్జన విధ్వంసంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. కాపుల ఐక్య గర్జన సభ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఐక్య గర్జనకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరును ఎ-1గాను, మరికొందరు కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులపై పోలీసులు కేసులు నమోదుచేశారు.