ఆంధ్రప్రదేశ్‌

గేట్ల మరమ్మతుల కోసం ప్రకాశం బ్యారేజి మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 22: ప్రకాశం బ్యారేజి గేట్ల మరమ్మతుల కోసం ఈనెల 20 తేదీ నుంచి అన్ని రకాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయటంతో చిరు వ్యాపారులతోపాటు అన్ని వర్గాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రధానంగా సిఎం నివాస గృహం ఉన్న కరకట్ట పరిసరాల్లో పండే అరటి, పలు రకాల పండ్లు, కూరగాయలు విజయవాడ మార్కెట్‌కు తరలించడానికి సామాన్య రైతులు ఎనె్నన్నో వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు. సాధారణంగా నిత్యం వేల సంఖ్యలో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఈ బ్యారేజీపై రాకపోకలు సాగిస్తుండేవి. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే కార్లు అన్నీ కూడా బ్యారేజి మీద నుంచి మంగళగిరి మీదుగా జాతీయ రహదారికి ఎక్కుతుండేవి. ప్రధానంగా కరకట్ట నుంచి కృష్ణానదీ తీరం వరకు వందలాది ఎకరాల్లో ఏడాది పొడవునా నేటికీ పలు రకాల పంటలు పండుతున్నాయి. అలాగే కొంతమేర కరకట్ట దిగువ ఉండవల్లి, తడవల్లి, కృష్ణాయపాలెం గ్రామ పరిసరాల్లో కూడా పలు రకాల పంటలు పండుతుంటాయి. చిరు వ్యాపారులు అక్కడ రైతుల నుంచి హోల్‌సేల్ ధరకు అరటికాయలు, పూలు, పలు రకాల కూరగాయలు కొని బుట్టలతో బ్యారేజీపై నుంచి సైకిళ్లపై వచ్చి విజయవాడ నగరంలో ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటివారు వందల సంఖ్యలో ఉన్నారు. ఇక చిన్న రైతులు, కౌలుదారులు ద్విచక్ర మోటారు వాహనాలపై విజయవాడ మార్కెట్‌కు సరుకు తరలిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటివారు వందల సంఖ్యలో ఉన్నారు. సచివాలయం, ఇక పలు సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగులు ఆటోల్లో రాకపోకలు సాగిస్తుండేవారు.
తడవల్లి, ఉండవల్లి పరిసర గ్రామాల్లో నివసించే కార్మికులు ఆటోలపై విజయవాడ నగరానికి చేరుకుని కూలినాలి చేసుకుని తిరిగి వెళుతుండేవారు. బ్యారేజి పక్కనే ఉన్న ఉండవల్లికి అలాగే కరకట్టకు రెండువైపుల గల తోటలకు వెళ్లాలంటే గతంలో కిలోన్నర మీటరు నుంచి రెండు కిమీ దూరం వెళితే సరిపోయేది. అయితే ప్రస్తుతం బ్యారేజీ మూసివేతతో కృష్ణలంక జాతీయ రహదారి, కనకదుర్గ వారధి, తాడేపల్లి, ఓల్డ్ టోల్‌గేట్, ఎన్టీఆర్ కరకట్ట, రైల్వే అండర్‌పాస్, ఉండవల్లి సెంటర్, పెనుమాక, కృష్ణాయపాలెం, మందడం మీదుగా కరకట్ట వైపు వెళ్లాల్సి వస్తున్నది. దీనివల్ల 11 కిమీ దూరం పెరుగుతుండటంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ద్విచక్ర వాహనాలపై రానుపోను 24 కిమీ దూరం పెరగటంతో కూరగాయలు, పండ్ల అమ్మకాలపై వచ్చే కొద్దిపాటి లాభం పెట్రోలు ఖర్చులకే సరిపోటం లేదంటూ చిన్న రైతులు, చిరు వ్యాపారులు, అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక సర్వీస్ ఆటో చార్జి గతంలో రూ.5లు ఉండగా ప్రస్తుతం రూ.40లు వరకు డిమాండ్ చేస్తున్నారు. కనీసం బ్యారేజి దిగువ ఆఫ్రాన్‌పై కనీసం ద్విచక్ర వాహనాలకు అనుమతివ్వాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా 2004లో మొత్తం 70 గేట్లకు గాను 56 గేట్ల మార్పిడి జరిగింది. ప్రస్తుతం మిగిలిన 14 గేట్లను పూర్తిగా మార్చడంతో పాటు ఇతర గేట్లకు స్వల్ప మరమ్మతుల కోసం జలవనరులశాఖ దాదాపు మూడు కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రస్తుతం ఆ నిధులతో పనులు జరుగుతున్నాయి. మే నెల 20 తేదీ వరకు ఎలాంటి పరిస్థితుల్లోనూ బ్యారేజిపై ఏ విధమైన రాకపోకలను అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే గత కొన్ని మాసాలుగా ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల గొల్లపూడి నుంచి దుర్గగుడి మీదుగా ప్రకాశం బ్యారేజీ వైపు బస్సులతోపాటు కార్లు, ఇతర వాహనాలను పూర్తిగా నిలిపివేయటం జరిగింది. గత కొద్ది రోజులుగా ఈ మార్గంలో ఆటోలను కూడా నిలిపివేసారు. హైదరాబాద్ నుంచి వాహనాలే కాకుండా కుమ్మరిపాలెం సెంటర్ పాతబస్తీవాసులు మిల్క్ఫ్యాక్టరీ, సొరంగం మీదుగా చుట్టు తిరిగి ప్రయాణం చేయాల్సి వస్తున్నది. మొత్తంపై అన్ని వర్గాల వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.