ఆంధ్రప్రదేశ్‌

రష్యాకు వ్యవసాయ ఉత్పత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 22: ఇరు ప్రాంతాలు పరస్పరం లబ్ధిపొందేలా స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు పెద్దఎత్తున జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, రష్యాలోని చెల్యాబినిస్క్ ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చాయి. ముఖ్యంగా మన రాష్ట్రం నుంచి వరి, మామిడి, మసాలా దినుసులు, సిరామిక్ తదితర ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వాణిజ్య సంబంధాలు, ఇతర అంశాలపై సహాయ సహకారాలు కోసం చెల్యాబినిస్క్, డిప్యూటీ గవర్నర్, ఏపీఈడిబీ నేతృత్వంలో జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ఇరు ప్రభుత్వాలు ఒక అవగాహనకు వచ్చాయి. అలాగే ఇరు ప్రాంతాల విద్యార్థులు, రైతులు విజ్ఞానాన్ని పంచుకునేలా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించాయి. గతేడాది రష్యాలో జరిగిన ఇన్నోప్రోమ్‌కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు చెల్యాబినిస్క్ ప్రాంతం గవర్నర్ బోరిస్ డుబ్రోవిస్కీ ఆధ్వర్యంలో వివిధ కంపెనీ సిఈవోలతో కూడిన బృందం శనివారం ముఖ్యమంత్రిని ఉండవల్లిలోని ఆయన నివాసంలోకలిసింది. చెల్యాబినిస్క్‌లోని రవాణా, ఖనిజ, అణు విద్యుత్ సంబంధిత కంపెనీల ప్రతినిధులు ఏపీలో తమ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు గల అవకాశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. చెల్యాబినిస్క్‌లో అభివృద్ధి చెందిన ఐటీ రంగాన్ని, స్మార్ట్ టెక్నాలజీని అధ్యయనం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. తాము బలంగా ఉన్న ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయం, వాణిజ్య రంగాలపై బోరిస్ డుబ్రోవిస్కీ ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. చెల్యాబినిక్స్ రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా బోరిస్ డుబ్రోవిస్కీ ఆహ్వానించారు. సమావేశం చివరిలో బృందం సభ్యులను ముఖ్యమంత్రి శాలువా కప్పి సత్కరించారు. అరకు కాఫీపై బోరిస్ డుబ్రోవిస్కీ ఆసక్తి కనబరిచారు.
రెండురోజులపాటు రాష్ట్ర పర్యటనకు వచ్చిన రష్యా బృందం మొదటగా శుక్రవారం విశాఖలో పర్యటించింది. శనివారం ముఖ్యమంత్రితో సమావేశమై అనంతరం రాజధాని అమరావతిని సందర్శించింది. సమావేశంలో చెల్యాబినిస్క్ డిప్యూటీ గవర్నర్ రస్లన్ గట్టరోవ్, ఆ ప్రాంత వ్యవసాయశాఖ మంత్రి సెర్జె సుష్కోవ్, ఐటీ శాఖ మంత్రి అలెక్స్ కోజ్లోవ్, రాష్ట్ర వ్యవసాయ-మార్కెటింగ్ శాఖల ముఖ్య కార్యదర్శ రాజశేఖర్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఏవి రాజవౌళి, ఏపిఈడిబి సిఇవో జాస్తి కృష్ణకిషోర్ పాల్గొన్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన రష్యా ప్రతినిధులు