ఆంధ్రప్రదేశ్‌

చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 22: దేశంలోని చేనేత, హస్త కళాకారులందరికీ ప్రత్యక్షంగా లబ్ధి చేకూరేలా ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు జారీచేస్తామని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో దేశంలోని ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. గన్నవరం సమీపంలోని స్వర్ణ్భారతి ట్రస్ట్ ప్రాంగణంలో శనివారం జరిగిన వివిధ కార్యక్రమాల్లో మంత్రులు స్మృతి ఇరానీ, వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిరువురూ ఇక్కడ చేనేత శిక్షణ పూర్తిచేసుకున్న పలువురు చేనేత, హస్తకళాకారులకు గుర్తింపు కార్డులు, సర్ట్ఫికెట్లు అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ ఈ గుర్తింపు కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం చేస్తామన్నారు. నైపుణ్య శిక్షణకు సంబంధించి తొలిసారిగా ఓ ప్రత్యేక మంత్రిత్వశాఖను ప్రారంభించిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందన్నారు. కేవలం శిక్షణే కాకుండా దీనికి సంబంధించిన పనిముట్లను కూడా అందిస్తున్నామన్నారు. యువత, మహిళ, పేద ప్రజలకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్య్రం అందించడం ప్రధాన లక్ష్యమన్నారు. గుర్తింపు కార్డు కోసం ఇక్కడి నైపుణ్య శిక్షణ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ నుంచి 48వేల 717 అభ్యర్థనలు వచ్చాయని అందులో నుంచి 20వేల 620 మందికి గుర్తింపు కార్డులు అందచేశామన్నారు. రాష్ట్భ్రావృద్ధి కోసం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని అలాగే పెన్షన్లు, రుణాలు అందచేస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ వెంకయ్యకు చెబుతుంటారని అన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా రాష్ట్రానికి పలు ప్రాజెక్టులు మంజూరు చేశానని, ఆ ఘనత పూర్తిగా వెంకయ్యనాయుడుకే దక్కుతుందన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఔళిశాఖ మంత్రిగా స్మృతి ఇరానీ అద్భుతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. ఆమె పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఔళిశాఖ పనితీరు ఉన్నత శిఖరాలకు చేరిందన్నారు. ప్రజలకు కనీస ప్రాథమిక సౌకర్యాలు అందించడం ప్రభుత్వ కర్తవ్యమన్నారు. దీనికి ఎన్‌జివో, కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. స్వర్ణ్భారతి ట్రస్ట్‌లో మున్ముందు మరిన్ని ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఎడ్లబండి బొమ్మ బహూకరిస్తున్న దృశ్యం