ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా చక్రస్నానం, ధ్వజావరోహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 23: మరో అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల పదో రోజు శనివారం ఉదయం సీతారామలక్ష్మణులకు వేద మంత్రోచ్ఛారణల మధ్య చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపి గ్రామోత్సవంగా స్థానిక రామతీర్థానికి తీసుకెళ్లారు. అక్కడ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. శనివారం రాత్రి ఆలయంలో ధ్వజావరోహణ కార్యక్రమాన్ని వైష్ణవ ఆగమ శాస్త్ర ప్రకారం పండితులు నిర్వహించారు. శనివారం స్వామివారి దర్శనార్ధం భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమాలలో టిటిడి డిప్యూటి ఇఓ బాలాజీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా కోదండ రామస్వామికి ఆదివారం సాయంత్రం పుష్పయాగం, ఏకాంత సేవ జరగనుంది. ఆలయ రంగ మంటపంలో ప్రత్యేకంగా అలంకరించిన పాన్పులో స్వామివారు పడుకుని ఉండగా అమ్మవారి ఉత్సవమూర్తులకు ఏకాంత సేవను నిర్వహించనున్నారు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుండి తీసుకొచ్చిన ప్రత్యేక పుష్పాలతో పుష్పయాగాన్ని నిర్వహిస్తారు.

చిత్రం రాములోరికి చక్రస్నానం నిర్వహిస్తున్న దృశ్యం