ఆంధ్రప్రదేశ్‌

నిమిషం ఆలస్యమైనా అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 23: ఎపి ఎంసెట్-2017ను సోమవారం నుంచి నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కాకినాడ జె ఎన్‌టియు పర్యవేక్షణలో మొత్తం 267 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంసెట్-2017కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు కాకినాడ జెఎన్‌టియులో సోమవారం ఉదయం విడుదలచేస్తారు. అలాగే ఒక నిమిషం ఆలస్యమైనా విద్యార్థులకు అనుమతి ఉండదని ముందుగా ప్రకటించిన ప్రభుత్వం ఈ నిబంధనను సడలించింది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించాలని నిర్ణయించినట్టు ఎంసెట్-2017 కన్వీనర్, జెఎన్‌టియుకె రిజిస్ట్రార్ ఆచార్య సిహెచ్ సాయిబాబు ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి చెప్పారు. ఈ ఏడాది నుంచి ఎంసెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండటంతో పాటు బయోమెట్రిక్ పద్ధతిలో విద్యార్థులను అనుమతిస్తారు. ఎంసెట్‌కు 2 లక్షల 77వేల 892 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా, వీరిలో ఇంజనీరింగ్‌కు లక్షా 96వేల 967 మంది దరఖాస్తు చేసుకున్నారు. మెడిసిన్, అగ్రికల్చర్‌కు 79వేల 624, రెండు విభాగాలకు 1101 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌కు 128 ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలు, అగ్రికల్చర్‌కు 139 కేంద్రాలు మొత్తం 267 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌కు 4, అగ్రికల్చర్‌కు 6 మొత్తం 10 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి పరీక్షలను సోమవారం నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తారు. మెడిసిన్ అగ్రికల్చర్ పరీక్షను 28న నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఆన్‌లైన్ పరీక్ష కావడంతో నిర్దేశిత సమయంకంటే గంటన్నర ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని కన్వీనర్ డాక్టర్ సాయిబాబు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి కాలిక్యులేటర్లు, స్మార్ట్‌వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టంచేశారు. పరీక్ష తేదీ, సమయాన్ని విద్యార్థికి హాల్‌టికెట్లలో తెలియజేశామని డాక్టర్ సాయిబాబు తెలిపారు.