ఆంధ్రప్రదేశ్‌

మానవాళికి నాగరికత నేర్పింది రచయితలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, ఏప్రిల్ 24: మానవాళికి నాగరికత, సంస్కృతి నేర్పింది రచయితలేనని, అలాంటి రచయితలకు రసస్పృహ అవసరమే కాని రాజకీయ స్పృహ అవసరం లేదని ప్రముఖ చారిత్రక నవలా రచయిత, ఫ్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ అన్నారు. సోమవారం ఒంగోలులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాలు తెలుగురాష్ట్రాల్లో మొక్కుబడిగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రంథాలయాలకు నిధులు లేకపోవటం వలన హైదరాబాదులోని రాజా రామ్‌మోహన్ రాయ్‌లాంటి గ్రంథాలయాలు పనిచేయకపోవటం వలన రచనలు కుంటుపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రంథాలయాలకు కనీసం పుస్తకాలను కొనుగోలు చేసేందుకు కూడా నిధులు మంజూరు చేయకపోవటం బాధాకరమన్నారు. గ్రంథాలయాలకు సంబంధించి తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఈ సంవత్సరం జూన్ తరువాత బడ్జెట్‌లో గ్రంథాలయాలకు నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని కడియం శ్రీహరి తనకు హామీ ఇచ్చారన్నారు. హైదరాబాదులో ప్రతిరోజు రెండు రచనలు ఆవిష్కరణ జరుగుతూనే ఉంటాయన్నారు. చరిత్రలాంటి రచనలకు మార్కెట్ లేదన్నారు.
హైదరాబాదులో, వరంగల్‌లో పుస్తక ప్రదర్శనకు మంచి క్రేజ్ వచ్చిందని తాను రచించిన మాలిక్క్ఫార్, కాకతీయ కళాదర్శనం పుస్తకాలకు మంచిస్పందన వచ్చిందన్నారు. నెలక్రితం రాజమండ్రిలో ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శన అనూహ్య స్పందన లభించిందన్నారు. ఇప్పటివరకు తాను వంద గ్రంథాలను రచించగా 60 గ్రంథాలను ముద్రించానన్నారు. లాభాపేక్షాలేకుండా పుస్తకాలను ముద్రిస్తున్నట్లు వెల్లడించారు. మాలికాఫర్ రచనలను ఆంధ్రభూమిలో డైయిలీ సీరియల్‌గా వేశారని గుర్తుచేశారు. తాను ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో జన్మించినట్లు తెలిపారు. జిల్లాతో, ఒంగోలుతో తనకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. చదువుకుంది ఒంగోలులో అయినప్పటికి వృత్తిరీత్యా హైదరాబాదులో 60సంవత్సరాలనుండి ఉంటున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాకు సాహిత్య, సాంస్కతిక పరంగా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు గుర్తించి జాతీయ, రాష్టస్ధ్రాయిలో ప్రత్యేక గుర్తింపుకోసం అవకాశం కల్పించాలన్నారు. సాహిత్యరంగంలో రాష్టస్థ్రాయిలో అవిభక్త కృష్ణా జిల్లా ఉండేదన్నారు. రాష్ట్రానికి మచిలీపట్నం సాంస్కృతిక రాజధాని అన్నారు. వెయ్యి సంవత్సరాల క్రితం ఒంగోలు శాసనం తనవద్ద ఉన్నట్లు వెల్లడించారు.
ప్రకాశం జిల్లా రచయతల సంఘం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ‘సాహిత్య ప్రకాశం’ గ్రంథాన్ని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్. ప్రభాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ముదిగొండ శివప్రసాద్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డికి అంకితం చేశారు.
జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి హనుమారెడ్డి, పొన్నూరు వేంకట శ్రీనివాసులు రచయిత ముదిగొండ శివప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు.