ఆంధ్రప్రదేశ్‌

బాబోయ్ మిర్చి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 25:ప్రభుత్వం మిర్చికి మద్దతుధర ప్రకటించిన నేపథ్యంలో గుంటూరు మిర్చియార్డుకు భారీగా సరకు తరలివస్తోంది. ప్రభుత్వం ఈనెల 20 నుంచి 15 వందల రూపాయలు అదనంగా మద్దతు ధర ఇస్తుండటంతో లక్షలాది టిక్కీల మిర్చిని రైతులు తరలిస్తున్నారు. కోల్డు స్టోరేజీలలో నిల్వలకు మద్దతుధర వర్తించదనే నిబంధన విధించడంతో నేరుగా యార్డుకే పంటను తీసుకొస్తున్నారు. గత రెండు రోజుల్లో నాలుగు లక్షల టిక్కీల మిర్చి బస్తాలను రైతులు తీసుకువచ్చారు. దీంతో మార్కెటింగ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా మిర్చిని తరలించడంతో తిరిగి ధరల్లో వ్యత్యాసం చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మద్దతుధర ప్రకటించడంతో తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన రైతులు కూడా సరకును చేరవేస్తున్నారు. ఇతర రాష్ట్రాలవారికి మద్దతు ధర లభించదని తెలిసినా తరలించడం గమనార్హం. వారు ఏదో ఒక ధరకు తమ పంటను తెగనమ్ముకోక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇతర దేశాలకు ఎగుమతి ఆర్డర్లు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిల్వలు పేరుకుపోతే రైతులు నష్టపోతారని మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావుఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా బుధవారం యార్డుకు సెలవు ప్రకటించారు. మంగళవారం రాత్రి నుంచే సరకు దిగుమతిని నిలిపివేస్తున్నట్లు యార్డు అధికారులు ప్రకటించారు. చంద్రన్న రాయితీ పథకం ముగిసేంత వరకు ఇతర రాష్ట్రాల మిర్చి రైతులు వేచి ఉండాలని కోరుతున్నారు. ఒకవైపు రాయితీ పథకానికి సాగు ధ్రువీకరణపత్రాలు, మరోవైపు కొనుగోళ్లు, పేరుకుపోతున్న నిల్వలతో మిర్చియార్డులో కోలాహలం నెలకొంది.

చిత్రం... గుంటూరు మిర్చి యార్డులో భారీగా పేరుకుపోతున్న నిల్వలు