ఆంధ్రప్రదేశ్‌

ఉష్ణోగ్రతలు అధిక‘మే’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 25: వచ్చే నెలలో తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే 45 నుంచి 47 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత పెరగనున్నాయి. వీటితోపాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గడచిన రెండేళ్లతో పోల్చి చూస్తే ఈ ఏడాది ఎండలు అధికంగానే ఉన్నాయని ఆంధ్రా యూనివర్శిటీ వాతావరణ విభాగ అధ్యాపకులు రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ నెలలో ఎండలు సాధారణం కన్నా ఆరు నుంచి ఏడు డిగ్రీలు అధికంగా ఉన్నాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ నెలలో ఎండలు అధికంగా ఉంటాయని శాస్తవ్రేత్తలు ముందుగానే హెచ్చరించారని, భారత ఉపఖండానికి ఇందులో మినహాయింపు లేదని ఆయన చెప్పారు. వాయవ్య దిశగా సముద్రంపై నుంచి పొడి గాలులు భూమీదకు వస్తున్నాయి. దీని వలన అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల మంగళవారం 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఏజెన్సీ ప్రాంతాలు వేసవిలో కాస్తంత చల్లగా ఉండేవి. కానీ ఇప్పుడు అక్కడ కూడా 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులనుబట్టి చూస్తే, వచ్చే నెలలో తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకూ చేరుకునే అవకాశం ఉందని రామకృష్ణ తెలియచేశారు.
ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఒంగోలు, నెల్లూరు, విజయనగరం, అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాల, నిజామాబాద్, హైదరాబాద్, రామగుండలలో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమలో సాధారణం కన్నా ఏడున్నర డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదయ్యాయి. నందిగామ, జంగమహేశ్వరపురం, తుని, విజయవాడ, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఎండల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు తెలియచేశారు.

చిత్రం... వడగాడ్పులకు నీరసించి విశాఖలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఇలా చెట్టుకింద ఫుట్‌పాత్ మీద విశ్రాంతి తీసుకుంటున్న కూలీలు