ఆంధ్రప్రదేశ్‌

అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ దక్షిణాసియాకే తలమానికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 23: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో హార్బర్ల అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం కలలుగన్న సాగరమాల ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. ఈ హార్బర్ రాకతో స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎదురుచూస్తున్నారు. దేశంలోనే తొలి డ్రెడ్జింగ్ హార్బర్‌కు అంతర్వేది కేంద్రంగా మారింది. దీంతో అంతర్వేది సాగరతీరం వెలిగిపోనుంది. డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణంతో ఈ ప్రాంతం దక్షిణాసియాకే తలమానికం కానుంది. అంతర్వేది రాజమహేంద్రవరానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యాంధ్రలో ప్రముఖ యాత్రా స్థలాల్లో ఒకటైన అంతర్వేది తాజాగా దేశంలోనే కీలకమైన డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటుకు మార్గం సుగమం కావడంతో మరింత అభివృద్ధి చెందనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల రవాణా రంగాన్ని కీలక మలుపు తిప్పే రెండు ప్రధాన ఒప్పందాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇటీవల జరిగాయి. జల రవాణాకు సంబంధించిన రెండు అంశాలపై ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందాల్లో భాగంగా ఆసియా దేశాల్లోనే తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటు చేయడంతోబాటు ఎపి నుండి వెళ్తున్న కేంద్ర జాతీయ జలరవాణా మార్గం నెం.4ను అభివృద్ధి చేయడం. ఇలా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇన్‌లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ రెండు కీలక ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయి. కేంద్ర జాతీయ జల రవాణా మార్గాల అభివృద్ధిలో భాగంగా 888 కిలోమీటర్ల మేర ఉన్న కాకినాడ-పుదిచ్చేరి జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ ఒప్పందం ద్వారా జాతీయ జల రవాణా మార్గాల అభివృద్ధి చేయడంతోబాటు డ్రెడ్జస్ రిపేరింగ్, వర్క్‌షాప్ కం స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్‌గా నిర్మాణమయ్యే ఈ అంతర్వేది హార్బర్ ఆసియా దేశాల్లోనే ప్రాధాన్యత సంతరించుకోనుంది. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది వద్ద డ్రెడ్జింగ్ హార్బర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడానికి అనేక కారణాలున్నాయి. అంతర్వేది సముద్రతీర ప్రాంతం ప్రకృతి ఉపద్రవాల నుంచి సురక్షితమైన ప్రాంతం కావడం ప్రధాన కారణం. సాగరమాల కార్యక్రమంలో భాగంగా రూ.1800 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. దశలవారీగా ఏర్పాటయ్యే ఈ డ్రెడ్జింగ్ హార్బర్ ప్రాజెక్టులో మొదటి విడతగా రూ.460 కోట్లు ఖర్చు చేయనున్నారు. శిక్షణా కేంద్రం, వౌలిక సదుపాయాల కల్పనా కేంద్రం, మొదటగా ప్రారంభమవుతాయి. అక్టోబర్ 3వ తేదీన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు అంతర్వేదిని సందర్శించనున్నారు. అంతర్వేది కారణంగా అరేబియా, హిందూ మహాసముద్రాల్లో డ్రెడ్జింగ్ పనులు చేపడతారు. ఈ డ్రెడ్జింగ్ హార్బర్ ప్రపంచంలోనే మూడవది కాగా మన దేశంలో తొలి హార్బర్. నౌకాశ్రయాల వద్ద సముద్రంలో మేటలువేసిన ఇసుకను ఎప్పటికప్పుడు తొలగించడానికి డ్రెడ్జర్లను ఉపయోగిస్తారు. ఇలా డ్రెడ్జర్ల ద్వారా ఇసుక మేటను తొలగించడం వల్ల సముద్రంలో రాకపోకలకు మార్గం సుగమమవుతుంది. ఓడల కింది భాగంలో ఇసుక మేటలు తగిలి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. సముద్రంలో ఇసుకను 25 మీటర్ల లోతు వరకు డ్రెడ్జర్ల ద్వారా తొలగించవచ్చు. అంతర్వేదిలో మొదటి దశలో భాగంగా 18 డ్రెడ్జర్లు అందుబాటులోకి తేనున్నారు.

చిత్రం సముద్రంలో పనులు నిర్వహిస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన నౌక