రాష్ట్రీయం

ఆచరిస్తారా? అనుసరిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 25: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో ఈనెల 29న చందోత్సవం సందర్భంగా నిర్వహించనున్న సహస్రఘటాభిషేకాన్ని వివాదాస్పదంగా మారుతోంది. ఆచార వ్యవహారాలతో, సంప్రదాయబద్ధంగా జరగాల్సిన ఘటాభిషేకానికి కొంత మంది తూట్లు పొడుస్తున్నారని అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన రుత్వికులపై ఆంక్షలు విధించారు. గతంలో ఎన్నడూ లేని ఆంక్షలను విధించడాన్ని వైష్ణవ, అర్చక సంఘాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. సింహాచల నృసింహస్వామి చందనోత్సవం రోజున మూలవిరాట్‌పై ఉన్న చందనాన్ని తొలగిస్తారు. అదే రోజు అర్థరాత్రి దాటిన తరువాత వెయ్యి కలశాలతో గంగధార నుంచి తీసుకువచ్చిన నీటితో స్వామిని అభిషేకిస్తారు. ఈ తంతు మొత్తాన్ని శ్రీవైష్ణవ స్వాములు మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, గత కొంత కాలంగా శ్రీవైష్ణవ స్వాముల వేషధారణలో కొందరు అన్యులు ఈ సేవలో పాల్గొంటున్నట్టు దేవస్థాన అర్చకులు, అధికారుల దృష్టికి వచ్చింది. అలాగే కొంతమంది వైష్ణవులే సంప్రదాయ విరుద్ధమైన వేషధారణలో పాల్గొంటున్నట్టు కూడా అధికారులు గమనించారు. ఇటువంటి వారిని అరికట్టాలని అధికారులు నిర్ణయించారు. ఘటాభిషేకంలో పాల్గొనదలచినవారు శ్రీవైష్ణవ సంప్రదాయ రీతిలో తీయించుకున్న ఫొటోను జతపరిచి దరఖాస్తులు దేవస్థానానికి అందించాలని ప్రకటన జారీ చేశారు. దరఖాస్తులను ఈనెల 20 వరకూ స్వీకరించారు. మొత్తంమీద 304 దరఖాస్తులు దేవస్థానానికి అందాయి. వీటిలో అధికారులు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా 150 దరఖాస్తులు మాత్రమే ఉన్నాయి. మిగిలిన దరఖాస్తులను అధికారులు తిరస్కరించారన్న ప్రచారం ముమ్మరంగా జరిగింది. దీంతో శ్రీవైష్ణవ సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. సంప్రదాయ రీతిలో ఘటాభిషేకం నిర్వహించాలని అధికారులు తీసుకున్న నిర్ణయం సరైనదే. సంప్రదాయ విరుద్ధంగా ఘటాభిషేకంలో పాల్గొన్న వారిని అధికారులు నిరోధించగలరా? ఇందుకు దేవస్థానం ముందున్న ప్రణాళిక ఏంటి? ఘటాభిషేకంలో పాల్గొనడం తమ హక్కుగా భావిస్తున్న శ్రీవైష్ణవస్వాములు ఆచార మర్యాదలు పాటించే వారినే ఈ సేవలో పాల్గొనేట్టు చేయగలరా? ఇందుకు శ్రీవైష్ణవ సంఘాల్లో ఇప్పటి వరకూ ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఏటా జరిగే ఘటాభిషేకానికి సుమారు 600 నుంచి 700 మంది పాల్గొంటున్నారు. వీరంతా కలశాలతో ఒకేసారి అంతరాలయంలోకి వెళ్లడం వలన స్వామి దర్శన భాగ్యం లభించక ఇబ్బంది పడుతున్నారు.