ఆంధ్రప్రదేశ్‌

నరేగా నిధులతో నవ్యాంధ్ర అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 26: జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద లభ్యమయ్యే కింద లభ్యమయ్యే నిధులను సద్వినియోగం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. అవినీతికి తావు లేకుండా, నాణ్యత, ప్రమాణాలతో పనులను చేపట్టాలని, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని కోరారు. ఏకీకృత నిధులతో 19శాఖలు అమలు చేస్తున్న పనుల పురోగతిని ఆయన బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షించారు. అభివృద్ధి-ఉపాధి కల్పనను అనుసంధానించి అమలు చేస్తున్న నరేగా పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సద్వినియోగపర్చాలని ముఖ్యమంత్రి చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఉపాధి హామీ నిధులతో 2లక్షల వర్మికంపోస్టు, ఎన్‌ఎడిఇసి గుంతలను తవ్వే కార్యక్రమం చేపట్టాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో, జాతీయ రహదారుల వెంట 10 వేల కిలోమీటర్ల మేర ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలని ఆదేశించారు. ఉద్యాన పంటలకు, ఎవెన్యూ ప్లాంటేషన్లకు వర్మి కంపోస్ట్‌ను వినియోగించాలని సూచించారు. రాష్ట్రంలో 50వేల ఎకరాల్లో ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని త్వరగా అమలు చేయాలన్నారు. నరేగాతో చేపట్టిన ప్రతి పనినీ గుర్తించేందుకు వీలుగా జియోట్యాగింగ్ చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ పనులను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠపర్చడం ద్వారా గ్రామాభివృద్ధి సాధించాలని చెప్పారు. వేసవిలో మంచినీటి కొరత రాకుండా చూసుకోవాలని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగాల అధికారులను ఆదేశించారు. ఇప్పటిదాకా వేయి గ్రామాలలో ఘన వ్యర్థాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు వివరించగా ముఖ్యమంత్రి స్పందిస్తూ ఘన వ్యర్థ నిర్వహణ స్వచ్ఛాంద్ర పనులలో అంతర్భాగమని ఆయన గుర్తు చేశారు. పంట కుంటల తవ్వకానికి ప్రాధాన్యం ఇచ్చి నరేగా పథకాన్ని విస్తృత ప్రాతిపదికన వినియోగించుకోవాలని, చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేయాలని, అటవీ ప్రాంతాల్లో చెక్ డ్యామ్‌లతో సెలయేళ్ల నుంచి దిగువకు ప్రవహించే నీటిని ఒడిసిపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు వేసవిలో పశుగ్రాసం కొరత రాకుండా పశువులకు మంచినీటికి కొరత లేకుండా చేయడానికి ప్రాధాన్యమిస్తున్నట్లు పశు సంవర్థకశాఖ ముఖ్యకార్యదర్శి మన్మోహన్ సింగ్ తెలిపారు. ‘ఉరూరా పశుగ్రాసం’ పథకంలో భాగంగా పశుగ్రాసం పెంచడానికి చెరువుగర్భాల్లో కొన్ని క్షేత్రాలను అభివృద్ధి చేస్తామని, గ్రామాలలో పశువులకు నిలువ నీడనివ్వటమే కాకుండా వాటి సంరక్షణ చూసేందుకు 6,500 పశు సంరక్షణశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిధుల ఏకీకృత విధానం ద్వారా అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజి పనులు, మంచినీటి పథకాల పనులు చేపట్టాలన్నారు. గ్రామాలను గ్రేడింగ్ చేసి అక్కడ సమస్యల తీవ్రతను గుర్తించి మంచినీటి సరఫరా చేయాలని, రహదారి అనుసంధాన వ్యవస్థలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నీరు-ప్రగతి 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను జలవనరుల శాఖ ప్రతిపాదించింది. తొంబై రోజుల్లో 1.04 లక్షల సేద్యపు కుంటల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రణాళిక సమర్పించింది. రాష్ట్రంలోని 1521 గ్రామ పంచాయతీల పరిధిలోని 88 మిషన్ వాటర్ కన్జర్వేషన్ బ్లాక్స్‌లో ఉన్న 30,000 మధ్యతరహా చెరువుల్లోను, ప్రస్తుతం ఉన్న 36,000 చెక్ డ్యామ్‌ల్లో పూడిక తీయాలని ప్రతిపాదనలు చేసింది. రాష్ట్రంలో 11,600 కొత్త చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని, ఒక్కోటి రూ.3 లక్షల లోపు వ్యయం అవుతుందని తెలియజేసింది. జిల్లాస్థాయిలో కన్వర్జెన్సీ కమిటీలను ఏర్పాటు చేయాలని, గ్రామస్థాయి కమిటీకి సర్పంచ్ అధ్యక్షుడుగా ఉంటారని, జన్మభూమి కమిటీ సభ్యులు, గ్రామస్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రతిపాదించింది. ఇదిలావుంటే పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను సమన్వయం చేశారు. సమావేశంలో సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖల మంత్రి కాల్వ శ్రీనివాసులు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఎ.వి.రాజవౌళి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... 19 శాఖల పనుల పురోగతిపై సిఎం చంద్రబాబు సమీక్ష సమావేశం