కృష్ణ

కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్మికుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 26: గ్రామ పంచాయతీ కార్మికులకు జీవోనెం.151 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి గ్రామ పంచాయతీ ఎంప్లారుూస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిఓ నెం.151 ప్రకారం రూ.12వేలు వేతనం ఇవ్వాలని, బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్, పార్ట్‌టైమ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం టెండర్ విధానాన్ని ఆపాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై నరసింహారావు, సహాయ కార్యదర్శి పి శంకర్, చౌటపల్లి రవి, జిల్లా అధ్యక్షుడు బి సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

శబ్ద కాలుష్యం నివారించి..
ప్రజారోగ్యాన్ని కాపాడదాం
* మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా. రాజారావు
* ఘనంగా ‘నో హారన్ డే’ అవగాహన ర్యాలీ
విజయవాడ (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 26: నగరంలో నానాటికీ శబ్ద కాలుష్యం పెరిగి ప్రజలు పలు వ్యాధులకు గురవుతున్నారని మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా.రాజారావు పేర్కొన్నారు. శబ్ద కాలుష్యాన్ని నివారించాలంటూ ‘‘నో హారన్ డే’’ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్, చెవి, ముక్కు, గొంతు వైద్యులు సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీలో భారీగా వైద్యులు, విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ చివరి బుధవారం దేశవ్యాప్తంగా ఈ విధమైన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రధానంగా శబ్ద కాలుష్య నివారణ విషయంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా.పొట్లూరి గంగాధరరావు మాట్లాడుతూ శబ్ధ కాలుష్యం కారణంగా ప్రజలు పలు మానసిక వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు. శబ్ద భూతాన్ని నివారించకుంటే ప్రజల్లో వినికిడి లోపం పెరిగిపోతుందని హెచ్చరించారు. ఇయన్‌టి వైద్యుల సంఘాల ప్రతినిధులు డా.సిఎస్‌ఎన్ ప్రసాద్, డా.సింగరి ప్రభాకర్‌లు మాట్లాడుతూ ఇప్పటికే నగరంలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరిందని, దీనికి ధ్వని కాలుష్యం తోడై భవిష్యత్‌లో ప్రజారోగ్యం విషయంలో లోపాలు దారుణాలు సంభవిస్తాయని తెలిపారు. ధ్వని కాలుష్యాన్ని నివారించేందుకు, ప్రధానంగా ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. బెంజి సర్కిల్ వరకూ సాగిన ఈ అవగాహన ర్యాలీకి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఐఎంఎ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్ కరుణామూర్తి తదితరులు పాల్గొన్నారు.

పోటోలు...ఎస్‌పి 3...సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి రవీంద్ర
ఎస్‌పి 2.. పాల్గొన్న వివిధ జిల్లాల క్రీడాధికారులు
గొప్ప క్రీడాకారులుగా ఎదగండి
* విద్యార్థులకు మంత్రి రవీంద్ర పిలుపు
* అధికారుల సమావేశంలో సౌకర్యాలపై సమీక్ష
విజయవాడ (స్పోర్ట్స్), ఏప్రిల్ 26: స్కూల్ విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి ఉందని, భవిష్యత్తులో విద్యార్థులు మంచి క్రీడాకారులుగా ఎదగాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. సబ్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం 13 జిల్లాల క్రీడాభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి క్రీడలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తున్నారని దానిని తగ్గట్టుగానే జిల్లాల్లో అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి జిల్లాల్లో మినీ స్టేడియాల నిర్మాణం చేపడుతున్నామని, జిల్లాల్లో కలెక్టర్లను కలుసుకుని సమస్యలను పరిష్కరించటానికి క్రీడాధికారులు కృషి చేయాలన్నారు. ఫిజికల్ లిటరసీని ప్రోత్సహించటానికి ప్రజలందరిలో అవగాహన కల్పించాలని, ముఖ్యమంత్రి దీనిపై ప్రత్యేకంగా చర్యలను తీసుకోవాలని చెప్పడం జరిగిందన్నారు. ఫిజికల్ లిటరసీని పెంచేందుకు కోచ్‌లను నియామించుకోవాలన్నారు. ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎస్ పథకంతో జిల్లాల్లో 3వేల క్రీడా మైదానాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అధికారులందరూ చిత్తశుద్ధితో కృషి చేస్తే పిల్లల్లోని క్రీడాస్ఫూర్తి బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాల్లో చేపట్టిన పనులను పాఠశాలల ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని, ఇందుకు రూ.230కోట్ల క్రీడా బడ్జెట్ అందుబాటులో ఉందన్నారు. రాష్ట్రంలో వేసవి క్రీడాశిక్షణా శిబిరాలు నిర్వహించి విజయవంతంగా చేపట్టలన్నారు. అనంతరం 13 జిల్లాల క్రీడాభివృద్ధి అధికారులతో వారి జిల్లాల్లో జరుగుతున్న క్రీడాభివృద్ధిని, మైదానాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా కుప్పం జిల్లాలో క్రీడాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శాప్ ఎండి చిత్తూరు జిల్లా అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో శాప్ ఎండి ఎన్ బంగార్రాజుతో పాటు 13జిల్లాల క్రీడాభివృద్ధి అధికారులు, శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.