ఆంధ్రప్రదేశ్‌

భావనపాడు వెనక భారీ దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఆంధ్ర రాష్ట్రంలో భావనపాడు పోర్టు నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మరో దోపిడీకి తెర తీస్తోందని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర సిగలో కిరీటమని, భారీ ఓడరేవు అంటూ పోర్టుకు గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. పోర్టు ఆదాయంలో 2.3 శాతం వాటాను రాష్ట్రప్రభుత్వానికి ఇవ్వడానికి జరిగిన ఒప్పందానికి వెనుక ఉన్న లొసుగులు ఏమిటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే వారంతా అభివృద్ధికి ఆటంకమన్నారు. రూ. 13వేల కోట్ల పోలవరం ప్రాజెక్టును రూ.42వేల కోట్లకు పెంచారు. తద్వారా కాంట్రాక్టు పనుల్లో విపరీతంగా దోచుకున్నారని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు తరహాలోనే భావనపాడులో కూడా మరో దోపిడీకి సిద్ధమవుతున్నారన్నారు. దేశం మొత్తం మీద స్విస్‌చాలెంజ్ విధానాన్ని వ్యతిరేకిస్తుంటే దాన్ని తీసుకువచ్చి రాజధాని కట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. తాత్కాలిక భవనాల పేరుతో చంద్రబాబు తన కాంట్రాక్టర్లకు చ.అ. రూ.6వేలకు నిర్మించడానికి తామము వ్యతిరేకమన్నారు. పట్టిసీమ, పురుషోత్తంపట్నం వంటి వాటిలోనూ ఇలాగే దోపిడీకి పాల్పడ్డారన్నారు. ఆఖరుకు ప్రజలకు అందాల్సిన ఆరోగ్య సేవలను కూడా మెడాల్ అనే సంస్ధకు కట్టబెట్టారన్నారు. ఈసికి లంచం ఇవ్వచూపిన కేసులో దినకరన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినప్పుడు, ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును తెలంగాణ పోలీసులు ఎందుకు అరెస్టు చేయరని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల నైపుణ్యత ఏమైపోయిందన్నారు.