ఆంధ్రప్రదేశ్‌

రేపు సింహాచలేశుని చందనోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, ఏప్రిల్ 27: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి చందనోత్సవం శనివారం జరగనుంది. 364 రోజులు చందనం ముసుగులో ఉన్న సింహాద్రి నాథుడు వైశాఖ శుద్ద తదియ సందర్భంగా శనివారం భక్తకోటికి తన నిజరూప దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించనున్నారు. దేశం నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలి రానున్నారు.
దేవాలయంలో సనాతనంగా వస్తున్న ఆచారాన్ని అనుసరించి వ్యవస్థాపక ధర్మకర్త హోదాలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుతో దేవస్థానం అధికారులు, వైదికులు తొలి దర్శనం చేయించనున్నారు. ధర్మకర్త దర్శనం అనంతరం సుమారు 3 గంటల సమయంలో సాధారణ భక్తులకు సింహాచలేశుని నిజరూప దర్శన భాగ్యం కల్పించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో పాటు అనేక మంది ప్రముఖులు రానున్నారు. ఉత్సవంలో భాగంగా తెల్లవారు జామున శాస్త్ర ప్రకారం అర్చకులు స్వామివారిని మేల్కొలుపుతారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దేహంపై ఉన్న గంధాన్ని తొలగిస్తారు. స్వామివారు నిజరూపంలోకి వచ్చిన తరవాత హృదయం, శిరస్సుల పైన పచ్చిగంధం ముద్దలను ఉంచుతారు. రాత్రి సుమారు 10 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభించనుంది. రాత్రి నిజరూప దర్శనంతో పాటు స్వామివారికి సహస్రఘటాభిషేకం జరగనుంది. శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన రుత్విక్కులు గంగధార నుండి కలశాలతో జలాలను తీసుకురాగా దేవాలయ వైదిక పెద్దలు వరాహ నారసింహుడికి అభిషేకం చేస్తారు.

చిత్రం.. చందనోత్సవానికి ముస్తాబైన సింహాచల దేవస్థానం, సింహాచలేశుని నిజరూపం (ఇన్‌సెట్‌లో)