ఆంధ్రప్రదేశ్‌

మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల టౌన్, ఏప్రిల్ 27: పేదపిల్లల బంగారు భవిష్యత్తు కోసమే మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుకు ఆదేశాలు జారీ చేశామని పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు ఫౌండేషన్ కోర్సులు సైతం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్లమాధ్యమం విద్య అందించి పేదపిల్లల భవిష్యత్తుకు బంగారుబాట వేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. అందులో భాగంగానే రాష్టవ్య్రాప్తంగా ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు మంత్రి తెలిపారు. అంగన్‌వాడీకేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లభాష నేర్పేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరులో అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి ఫలితాలు పొందామన్నారు.