ఆంధ్రప్రదేశ్‌

ప.గో.లో బాహుబలి టెన్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 27: రాజవౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి-2 విడుదల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గతంలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. గత అనుభవాల నేపథ్యంలో అధికార్లు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాహుబలి-2 విడుదల నేపథ్యంలో భీమవరంలోని వివిధ ప్రాంతాల్లో అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. కానీ వాటిని కొందరు చించేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గురువారం ఈ విధమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు దృష్టికి తీసుకెళ్లడంతో మున్సిపల్ సిబ్బంది భారీ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. భీమవరం పట్టణంలో సెక్షన్ 30తో పాటు 144వ సెక్షన్ అమలుచేస్తున్నట్టు నరసాపురం డిఎస్పీ పూర్ణచంద్రరావు ప్రకటించారు. ఈ నెల 30 వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు. అలాగే బాహుబలి-2 విడుదల సందర్భంగా భీమవరంలో చిత్రం ప్రదర్శించే అన్ని థియేటర్ల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటుచేశారు. సిఐ, ఎస్సై, ఎఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లతో బృందాలు ఏర్పాటుచేసి, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే పవణ్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానులతో సమావేశాన్ని నిర్వహించి, ఎటువంటి ఘర్షణలు చెలరేగినా కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. ర్యాలీలు నిర్వహించడం, భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు తదితరాలు ఏర్పాటుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ముందుజాగ్రత్తగా కొందరు అల్లరిమూకలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా 2014లో భీమవరం పవణ్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి భీమవరం టూటౌన్ పోలీసులు 55 మందిపై కేసులు నమోదుచేశారు. వీరంతా పవన్ అభిమానులే. వీరు ఇప్పటికీ న్యాయస్థానాల చుట్టూ తిరుగుతుండటం గమనార్హం.
నగదు రహితానికి నోఛాన్స్
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బాహుబలి-2 చిత్రం తిలకించడానికి టిక్కెట్లు కొనుగోలుచేసే ప్రేక్షకులకు చెల్లింపుల్లో ఇటీవల ప్రవేశపెట్టిన నగదు రహిత సౌకర్యం అందుబాటులో ఉంచడంలేదు. నోట్ల రద్దు నేపథ్యంలో మొదలైన నగదు రహిత సేవలు కొన్ని థియేటర్లలో ప్రవేశపెట్టినప్పటికీ, బాహుబలి-2కు మాత్రం అమలుచేయడంలేదు.