ఆంధ్రప్రదేశ్‌

అవినీతిపరుల ఆస్తుల స్వాధీనానికి చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 27: అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఒక చట్టాన్ని రూపొందిస్తున్నట్లు అవినీతి నిరోధకశాఖ (ఎసిబి) డైరెక్టర్ జనరల్ ఆర్‌పి ఠాకూర్ వెల్లడించారు. రెవెన్యూరికవరీ చట్టం తరహాలో ఒక నెల రోజుల్లో ఈచట్టాన్ని కార్యాచరణలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఎసిబి కార్యాకలాపాలను పునర్‌వ్యవస్థీకరించనున్నట్టు ఆయన తెలిపారు. కొత్తగా సాంకేతిక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆధునాతన సాంకేతిక పరికరాలను కూడా కొనుగోలు చేశామన్నారు. కేంద్రంలోని సిబిఐ, సివిసి, ఐటి వంటి సంస్థల సమన్వయంతో అవినీతిపరుల ఆటకట్టిస్తామని ఠాకూర్ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల్లో ఎసిబి యూనిట్లు ఉన్నాయని, ఏడాది కాలంలో అన్ని యూనిట్లకు సొంత భవనాలు, వాహనాలను సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే తిరుపతి, ఏలూరు, విశాఖపట్నంలో కార్యాలయ భవనాల నిర్మాణం ప్రారంభమైందని, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, నెల్లూరు కార్యాలయాలు టెండర్ల దశలో ఉన్నాయని వివరించారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన కాకినాడలోని జిల్లా రిజిస్ట్రార్ బాలప్రకాష్ ఇల్లు, ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 3కోట్ల ఆస్తులను గుర్తించామన్నారు. అవినీతిపరులపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించినట్లు అవినీతి తగ్గితేనే ప్రజల్లో ఆనందం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. అవినీతిపరులను గుర్తించేందుకు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటామన్నారు.. సామాజిక మాధ్యమాలను కూడా అవినీతి కార్యకలాపాల నిరోధానికి వినియోగిస్తామని ఠాకూర్ చెప్పారు. రాజమహేంద్రవరంలో త్వరలో ఎసిబి కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమ శాఖలోని ఇంటి దొంగలపై కూడా నిఘా ఉంచుతామని ఠాకూర్ స్పష్టం చేశారు. ఆయన వెంట ఎసిబి రాజమహేంద్రవరం డిఎస్పీ సుధాకర్ కూడా ఉన్నారు.