ఆంధ్రప్రదేశ్‌

బెట్టింగ్ ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 27: ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌ల బెట్టింగ్‌కు పాల్పడుతున్న అంతర్‌జిల్లా ముఠా సభ్యులను నెల్లూరు నగర పోలీసులు గురువారం అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి భారీ నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని గురువారం ఇక్కడ తెలిపారు. . కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ఖాదరాబాద్‌కు చెందిన ఏలే నాగరాజు, హైదరాబాద్‌కు చెందిన అశోక్ వర్మ ప్రధాన వ్యక్తులుగా గత కొంత కాలం నుండి నగరంలోని రామ్మూర్తినగర్‌లో ఓ విలాస భవంతిని అద్దెకు తీసుకొని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. నెల్లూరు ఎస్పీ రాముడు, స్థానిక సి ఐ సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది పకడ్బందీగా బుధవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించి భవంతిలో ఉన్న 13 మంది ముఠా సభ్యుల్లో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో ప్రొద్దుటూరుకు చెందిన చెన్నా కిరణ్‌కుమార్, వడ్ల కమల్‌దిన్, బత్తల ప్రేమ్‌కుమార్, ఏలే నాగరాజు, ఏలే నాగేంద్ర, ఏలే పవన్‌కుమార్, గుర్రం నాగేంద్ర, ఏలే సుబ్బరాయుడు, హైదరాబాద్‌కు చెందిన ముదునూరు అవినాష్ వర్మ, ఇళ్ల రాజేష్, ప.గోదావరి జిల్లాకు చెందిన వెగెసిన చంద్రశేఖర్‌రాజులు ఉన్నారు.