ఆంధ్రప్రదేశ్‌

కాశ్మీర్ కాల్పుల్లో విశాఖ జవాను మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 27: దేశ భక్తికి ఆ కుటుంబం అంకితం. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములు గడచిన 18 సంవత్సరాల నుంచి ఆర్మీలో జనాన్లుగా పనిచేస్తున్నారు. జమ్ములో ఉగ్రవాదులో గురువారం తెల్లవారుజామున జరిపిన దాడుల్లో వీరిద్దరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. మరి కొద్ది గంటల్లో విధులు ముగించుకుని స్వగ్రామమైన విశాఖకు రావల్సిన తన కొడుకు ఉగ్రమూకల దాడికి బలైపోయాడని తెలిసి తండ్రి కుప్ప కూలిపోయాడు. కుటుంబం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. స్థానిక కంచరపాలెం వద్ద ఉన్న ఆశవానిపాలానికి చెందిన బొట్టా వెంకటరమణ గురువారం జమ్ములో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. వెంకటరమణ, ఆయన సోదరుడు అప్పలరాజు 18 సంవత్సరాల కిందటే ఆర్మీలో చేరారు. మూడో సోదరుడు విశాఖలోనే ఆటో నడుపుతున్నాడు. వెంకటరమణ ఆర్మీలో చేరిన తరువాత ఎక్కువ కాలం జమ్ము, కాశ్మీర్‌లోనే పనిచేశాడు. సుమారు తొమ్మిది సంవత్సరాల కిందట వెంకటరమణకు అనితతో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు పిల్లలు చిన్మయి, గణేష్ ఉన్నారు. వెంకటరమణ పదవీకాలం గురువారంతో ముగిసింది. తన సర్వీస్‌ను ఐదేళ్లపాటు పొడిగించాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చేలోగా తన కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు వెంకటరమణ శుక్రవారం ఉదయం జమ్ము నుంచి బయల్దేరాల్సి ఉంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. బుధవారం రాత్రి వెంకటరమణ స్థానంలో రావల్సిన రిలీవర్ రాలేదు. దీంతో ఆయన విధుల్లో కొనసాగాల్సి వచ్చింది. మరి కొద్ది గంటల్లో విధుల నుంచి వైదొలిగి, ఇంటికి వెళ్లాల్సిన రమణను ఉగ్రవాదుల రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఆర్మీ స్థావరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో వెంకటరమణ అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు గురువారం ఉదయం విశాఖలోని రమణ కుటుంబ సభ్యులకు తెలియచేశారు. దీంతో కుటుంబం మొత్తం కుంగిపోయింది. నాన్న వస్తాడన్న ఆనందంతో గంతులేస్తున్న రమణ పిల్లలకు, జరిగిన ఘోరం తెలియదు. ఇల్లంతా రోదనలతో నిండి ఉండడాన్ని చూస్తూ ముక్కుపచ్చలారని చిన్నారులిద్దరూ బిక్కుబిక్కుమంటూ ఓపక్క నిలబడి చూడ్డం అందరినీ కలిచివేసింది. రమణ మృతదేహం శుక్రవారం విశాఖకు చేరుకోనుంది. అధికార లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు జరగనున్నాయి.

చిత్రం...మృతుడు వెంకటరమణ