ఆంధ్రప్రదేశ్‌

అంగన్‌వాడీ కేంద్రాలను ప్రక్షాళన చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ కేంద్రాల ప్రక్షాళన జరగాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. మహారాష్టల్రో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణను పరిశీలించి వచ్చిన స్పీకర్ అక్కడ విజయవంతమైన పద్ధతులను ఆంధ్రాలో అమలుచేయాలని సూచించారు. శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో భేటీ అయ్యారు. నూతన రాజధానికి ఉద్యోగుల తరలింపు, శాసనసభలో ఉద్యోగుల విభజన వంటి అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. ఇటీవల మహారాష్టల్రోని ఐఏస్‌ఓ గుర్తింపు పొందిన అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును స్పీకర్ వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో తీసుకురావల్సిన మార్పుల గురించి వీరు చర్చించారు. రాజధానిలో తాత్కాలిక సచివాలయం పనులు శరవేగంగా జరుగుతుండగా, శాసనసభ నిర్మాణం విషయం కూడా వీరు చర్చించారు. రానున్న సమావేశాలను అక్కడే పరిశీలించాలని ఇప్పటికే సిఎం నిర్ణయించారని, శాసనసభ పనులు కూడా వేగంగా జరగాల్సిన ఆవస్యకతను సభాపతి డాక్టర్ కోడెల ప్రధానకార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు.