ఆంధ్రప్రదేశ్‌

‘ఎయిమ్స్’కు సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 27: అమరావతిలో అఖిల భారత వైద్య విజ్ఞాన కేంద్రం (ఎయిమ్స్) నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో కలిసిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సికే మిశ్రాతో ఎయిమ్స్ ఏర్పాటు పురోగతి గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తున్నామని, కేంద్రం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి ఎయిమ్స్ నిర్మాణంలో వేగం పెంచాలని కోరారు. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ట్రామాకేర్ సెంటర్లు, ఐసియు సెంటర్లు ఏర్పాటు చేయడంలో సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యశాఖ కార్యదర్శి మిశ్రాను కోరారు. విభజన అనంతరం గాయపడిన ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తున్నట్టే ఆరోగ్యరంగంలో కూడా పూర్తి తోడ్పాటును అందిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మిశ్రా హామీ ఇచ్చారు. తన ఏపీ పర్యటనలో రాష్ట్ర ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పులు, తెచ్చిన సంస్కరణలు, అమలవుతున్న పథకాలను పరిశీలించానని మిశ్రా తెలిపారు. ఏపీలో అమలుచేస్తున్న ఆరోగ్య పథకాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.