ఆంధ్రప్రదేశ్‌

స్పష్టతతో ముందుకు వెళదాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 27: గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై స్పష్టతతో వెళితే సత్ఫలితాలు సాధిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. గ్రామీణాభివృద్ధి, సాలీడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్, రోడ్లు, డ్రైనేజీ వంటి కీలక అంశాలపై చర్చించి వాటిని కొన్ని నియోజకవర్గాల్లో అమలుచేయాలన్న లక్ష్యంతో, లోకేష్ గురువారం నిర్వహించిన ఈ నాలుగు గంటల సమావేశంలో ఆయన పూర్తి స్పష్టతతో మాట్లాడినట్లు సమాచారం.
కేంద్ర నిధులకు సంబంధించి మనకు కొన్ని సమస్యలొస్తుంటాయి. అయితే దాని గురించే ఆలోచించి మాట్లాడుకోవడం వల్ల సమయం వృథా కావడం తప్ప మరొకటుండదు. దానిని ఎలా పూర్తి చేయాలన్న కోణంలో ఆలోచించి పనులు పూర్తి చేసుకోవాలని లోకేష్ సూచించారు. సమావేశానికి హాజరైన 12 మంది ఎమ్మెల్యేలనుద్దేశించి మాట్లాడుతూ మీరంతా ఈ పనులన్నీ చేసేందుకు అధికారుల సేవలు వాడుకోండి. వారికి సహకరించండి. అన్ని పనులు పూర్తయితే మీ నియోజకవర్గం అందరికీ రోల్‌మోడల్ అవుతుంది. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, మంత్రుల పాత్ర ఏమిటన్నదానిపై లోకేష్ ఇచ్చిన స్పష్టతపై ఎమ్మెల్యేలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారులు వాస్తవకోణంలో వెళితే అనేక సమస్యలు పరిష్కారమవుతాయని, ఎమ్మెల్యేలు కూడా వారికి ఆ కోణంలో సహకరిస్తే చాలా సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయన్నారు. ‘ఒకటిరెండుసార్లు మామూలుగా కలవడం తప్ప నాకు లోకేష్‌తో గతంలో పెద్దగా పరిచయం లేదు. ఈ మధ్య మీ మీడియాలో ఆయనపై చాలా వస్తున్నాయి. అందువల్ల ఈ మీటింగ్‌లో ఎలా మాట్లాడతారో అనుకున్నా. కానీ నాలుగు గంటలపాటు జరిగిన మా సమావేశంలో ఏ నిమిషంలో కూడా మాకు బోర్ అనిపించలేదు. అదే పెద్దాయన మీటింగంటే బోరు అనిపించేది. లోకేష్‌కు చాలా విషయాల్లో క్లారిటీ ఉన్నట్లు అనిపించింది. కాకపోతే తెలుగుపై పట్టు లేకపోవడంతో దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడంలో ఇబ్బందిపడుతున్నట్టు అనిపించింది. మా మీటింగులో మేమేం చేయాలి, కలెక్టర్లు ఏం చేయాలి? ఆఫీసర్లు ఏం చేయాలి? సమయం వృథా కాకుండా ఎలా వ్యవహరించాలి అన్న దానిపై లోకేష్ చాలా స్పష్టతతో ఉన్నట్లు అర్థమయింది. మాకూ అదే చెప్పారు. ఇంకా మా ఎమ్మెల్యేలే పిచ్చి ప్రశ్నలు వేసి విసిగించారు. తెలుగులో కొంచెం పట్టు సాధిస్తే ఆయన ఇంకా బాగా స్పష్టతతో మాట్లాడగలరనిపించింద’ని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సమావేశంలో మంత్రి నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్ర, కూనరవికుమార్, వల్లభనేని వంశీ, యరపతినేని శ్రీనివాసరావు, శ్రీరాంతాతయ్య, హనుమంతచౌదరితోపాటు ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.