ఆంధ్రప్రదేశ్‌

తిరుపతి - జమ్మూ తావి హమ్‌సఫర్ రైలు ట్రయల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, ఏప్రిల్ 28: నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తిరుపతి- జమ్మూతావి హమ్ సఫర్ నూతన రైలుకు శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. తిరుపతి నుంచి బయలుదేరి గుంతకల్లు రైల్వేస్టేషన్ చేరుకున్న హమ్‌సఫర్ ఏసి రైలును గుంతకల్లు డివిజనల్ మేనేజర్ అమిత్ ఓజా, ఎడిఆర్‌ఎం సుబ్బరాయుడు పరిశీలించారు. ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ హమ్ సఫర్ రైలులో మొత్తం కోచ్‌లన్నీ ఏసివి కావడం గమనార్హం. రైలులోని ప్రతి కోచ్‌లో ఏసితో పాటు జిపిఎస్ సిస్టం అందుబాటులో ఉంచారు. దీంతో ముందుగా వచ్చే స్టేషన్ వివరాలు డిస్‌ప్లేపై కనిపిస్తాయి. ఇది ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే విధంగా సిసి కెమెరాలతో పాటు స్మోక్ డిటెక్టర్లు, అలారం సౌకర్యం అందుబాటులో ఉంచారు. పొగ రాగానే అలారం దానంతంట అదే మోగుతుంది. అలారం మోగగానే ఏ కోచ్ నుంచి పొగ వచ్చేది లైటింగ్ ద్వారా తెలుసుకునే ఏర్పాటు చేశారు. పొగ డిటెక్టర్, ఫైర్ డిటెక్టర్, సిసి కెమెరాల పనితీరు, జిపిఎస్ సిస్టమ్ డిస్‌ప్లేలను డిఎం పరిశీలించారు. త్వరలోనే ఈ రైలు గుంతకల్లు డివిజన్‌లోని తిరుపతి నుండి జమ్మూలోని తావి వరకు ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా తిరుగుతుంది.

చిత్రం..శుక్రవారం హమ్ సఫర్ నూతన రైలు ట్రయల్ రన్‌లో ప్రయాణిస్తున్న అధికారులు