ఆంధ్రప్రదేశ్‌

మీడియాను అడ్డంపెట్టుకుని కుటిల రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: ప్రజా క్షేత్రంలో వైఎస్ జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక మీడియాను అడ్డంపెట్టుకుని ఎపి సిఎం చంద్రబాబునాయుడు కుటిల రాజకీయాలు చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సిపి ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. కొన్ని ప్రసారమాధ్యమాలు పనిగట్టుకుని జగన్ బెయిల్ రద్దు అయ్యిందంటూ కథనాలు ప్రచారం చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎపి అవినీతిలో రెండో స్థానంలో ఉందని సిఎంఎస్ అనే సంస్థ అధ్యయనంలో తేలిందని అన్నారు. అవినీతిలో కర్నాటక ప్రభుత్వంతో చంద్రబాబు ప్రభుత్వం పోటీపడుతోందని అన్నారు. 600 హామీలకు పైగా ప్రకటించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. హామీలు నెరవేర్చని చంద్రబాబు పాలనకు అనర్హుడని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌పై సిబిఐ కేసులను అడ్డంపెట్టుకుని అవాకులు చెవాకులు పేలటం ఆపాలన్నారు. సోనియా గాంధీని వ్యతిరేకించడం వల్లే 11 చార్జిషీట్లు వేయించారనే పచ్చి నిజం బయటకు రాకుండా పోదని అన్నారు. చంద్రబాబు, సోనియా గాంధీ కుట్ర చేసి వైఎస్ జగన్‌ను జైలుకు పంపించారని భూమన ఆరోపించారు. ఈ విషయం ఒక్కసారి కాదు, కొన్ని లక్షల సార్లు అంటూనే ఉంటామని, ఇది పచ్చి నిజమని అన్నారు.