ఆంధ్రప్రదేశ్‌

రేపు రంగస్థల పురస్కారాల ప్రదానోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 28: తొలి నాటకానికి తెరలేచిన వేదిక..తొలి నాటకం రూపుదాల్చిన గోదావరి చెంత రాజమహేంద్రవరంలో కందుకూరి విశిష్ట, ప్రతిష్ఠాత్మక రంగస్థల పురస్కారాల ప్రదానోత్సవం, నంది నాటక బహుమతుల ప్రదానోత్సవాన్ని ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. నందమూరి తారక రామారావు పేరిట ఇచ్చే తొలి అవార్డుల ప్రదానం కూడా రాజమహేంద్రవరం నుంచే ఆరంభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టివి, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో కందుకూరి జయంతిని నాటక రంగ దినోత్సవంగా ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు 30వ తేదీన నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం, కందుకూరి రంగస్థల పురస్కారాలు, నంది నాటక విజేతలకు బహుమతుల ప్రదానం భారీ స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.కోటి విరాళం
తిరుపతి, ఏప్రిల్ 28: టిటిడి ఆధ్వర్యంలోని స్విమ్స్‌లో అమలు చేస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని పథకానికి ముంబయికి చెందిన అంబుజా ఇంటర్మీయేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత లలిత టి షా రూ. కోటిని విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని ఆయన ఆన్‌లైన్ ద్వారా ఈ పథకానికి బదిలీ చేశారు. ఈసందర్భంగా శ్రీవారి దర్శనానంతరం స్విమ్స్‌కు విచ్చేసిన ఆయన్ను డైరెక్టర్ టి ఎస్ రవికుమర్ శుక్రవారం ఘనంగాసన్మానించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించి, అభినందించారు.