ఆంధ్రప్రదేశ్‌

వెనుకబడిన విద్యార్థులకు వేసవిలో శిక్షణ తరగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే గురుకుల పాఠశాలల్లో చదువుకుంటూ చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రభు త్వం వేసవిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తుందని, తద్వారా మెరుగైన ఫలితాలను సాధిస్తుందని సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. శనివారం నాడు హైదారబాద్ సచివాలయంలో తన చాంబర్‌లో మంత్రి రావెల మాట్లాడుతూ తమ శాఖ నిర్వహణలో ఉన్న గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధులను చదువులో వెనుకబాటును తగ్గించి మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రభుత్వం రెండు విభాగాల్లో దాదాపు 12480 మంది విద్యార్ధులకు భవితకు పునాది పేరిట శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 9వ తరగతి విద్యార్ధులకు 31 రోజుల పాటు ఆంగ్లం, గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ప్రతి జిల్లాలో 240 మంది బాలురు, 240 మంది బాలికలు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 13 జిల్లాల్లో 6240 మంది 9వ తరగతి విద్యార్ధులకు ఈ శిక్షణ తరగతుల ద్వారా లబ్ది చేకూరుతుందని చెప్పారు. ప్రతి జిల్లాలో బాలలకు ఒక కేంద్రం, బాలికలకు ఒక కేంద్రం ద్వారా శిక్షణ ఇస్తారని అన్నారు. 4,5,6 తరగతులు చదువుకునే విద్యార్ధులకు 20 రోజుల పాటు ఆంగ్లం, గణితంలో శిక్షణ ఇస్తామని 13 జిల్లాల్లో 6240 మంది విద్యార్ధులకు ఈ కోర్సు వల్ల లబ్ది చేకూరుతుందని అన్నారు.
ప్రభుత్వం చదువులో వెనుకబడిన పేద విద్యార్ధులను ముందుకు తీసుకువెళ్లి చదువులో మంచి ఫలితాలు సాధించేందుకు ఈ పథకానికి రూపకల్పన చేయ డం జరిగిందని అన్నారు. చదువులో వెనుకబడిన బిసి గ్రేడ్‌ల విద్యార్ధులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ వేసవి శిక్షణా తరగుతల్లో పాల్గొని చదువులో వెనుకబాటు నుండి బయటకు రావాలని పేర్కొన్నారు. నిపుణులైన అధ్యాపకులు ఈ శిక్షణ అందిస్తారని చెప్పారు.