ఆంధ్రప్రదేశ్‌

రాయితీ ఆఫర్‌తో పన్ను వసూళ్లు రెట్టింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 28: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రకటించిన రాయితీ ఆఫర్ సత్ఫలితాలనిస్తోంది. ఏడాది ఆస్తిపన్ను మొత్తం ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విస్తృత ప్రచారం కూడా చేపట్టారు. దీనితో గత ఏడాదితో పోలిస్తే ఈఏడాది పన్ను వసూళ్లు రెట్టింపయ్యాయి. ఈ రాయితీ గడువు శనివారంతో ముగియనుండటంతో ఇప్పటికీ పన్ను చెల్లింపులకు ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే... 2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఒక దశలో మొండి బకాయిలకు సంబంధించి ఆస్తుల జప్తుకూడా ప్రారంభించారు. ఈ విధానం సత్ఫలితానివ్వడంతో మొండి బకాయిల వసూళ్లు బాగానే జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇకపై మొండి బకాయిలు ఉంచరాదని ప్రభుత్వం భావించింది. ఈమేరకు ఏడాదికి ఒకసారే అంటే ఏడాది పన్ను డిమాండ్ నోటీసులు ఇవ్వడం ప్రారంభించారు. ఆ మొత్తాన్ని ఏడాది కాలంలో ఎప్పుడైనా చెల్లించుకోవచ్చు. ఈ విధంగా వసూళ్లు కొంచెం ఫర్వాలేదు అనిపించింది. అయితే ఏడాది మొత్తం ఆస్తి పన్ను, నీటి పన్నులు ఒకేసారి వసూళ్లు జరగాలన్న ఉద్దేశంతో రాయితీ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఆస్తిపన్ను ఏకమొత్తంగా చెల్లించేవారికి ఆ మొత్తంపై 5 శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రాయితీ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారీగా ప్రచారం చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం, మైకులు, ఆటోలు, కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించారు. మీ సేవ, సిటిజన్ సర్వీస్ సెంటర్, ఆన్‌లైన్, పురసేవ యాప్‌ల ద్వారా ఈ పన్నులను చెల్లించే అవకాశం కల్పించారు. దీనితో వసూళ్లు ఊపందుకున్నాయి.