ఆంధ్రప్రదేశ్‌

ఎర్ర స్మగ్లర్ నరుూం అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 28: ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ మినీ లగేజీవ్యాన్‌ను శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి టాస్క్ఫోర్స్ సిబ్బంది సినీఫక్కీలో వెంటాడారు. ఈక్రమంలో మినీ లగేజీ వ్యాన్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన స్మగ్లర్ నరుూంను అరెస్టు చేశారు. నరుూంను వెంటాడే సమయంలో టాస్క్‌పోర్స్ కానిస్టేబుల్స్ ఇద్దరికి స్వల్పగాయాలైయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున స్థానిక కరకంబాడి రోడ్డులోని గెస్ట్‌లైన్ డేస్ హోటల్ సమీపంలో ఒక మినీలగేజ్ వ్యాన్‌లో 39 ఎర్రచందనం దుంగలను నింపుకొని జిల్లాసరిహద్దులు దాటించడానికి స్మగ్లర్లు సిద్ధమయ్యారు. ఈ వ్యాన్‌లో సరుకుపై అనుమానించిన ఆర్‌ఎస్‌ఐ విజయ్, డిఆర్వో దుర్గారాం ప్రసాద్ వాహనాన్ని నిలిపే ప్రయత్నం చేశారు. వాహనం నడుపుతున్న నరుూం వాహనాన్ని ఆపకుండ ముందుకు దూసుకెళ్ళాడు. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు మరో వాహనంతో దాన్ని వెంబడించి ఎట్టకేలకు అందులోని స్మగ్లర్ నరుూంను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని అందులో ఉన్న అందులో 39ఎర్రచందనం దుంగల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరుూంను పట్టుకునే క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.