ఆంధ్రప్రదేశ్‌

రాష్టప్రతి ఎన్నికల తర్వాత మారనున్న బిజెపి వ్యూహం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 28: రాష్ట్రంలో సొంతంగా బలపడేందుకు బిజెపి కసరత్తు ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ, వచ్చే ఎన్నికల నాటికి 15 పార్లమెంటు స్థానాల్లో కీలకశక్తిగా ఎదిగే ప్రణాళికకు ఆ పార్టీ నాయకత్వం పదునుపెడుతోంది. ఆ మేరకు గత రెండేళ్లుగా విజయం సాధించిన, వివిధ రాష్ట్రాల్లో అనుసరించిన పోలింగ్ బూత్ వ్యవస్థను ఇక్కడా అమలుచేయనుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో తెలుగుదేశం-బిజెపి మధ్య జరుగుతున్న దోబూచులాటకు రాష్టప్రతి ఎన్నికల తర్వాత తెరపడే అవకాశాలున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన రాష్టప్రతి ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే అవసరం ఉన్నందున, వివిధ రాష్ట్రాల్లోని మిత్రపక్షాలతో సఖ్యతను కొనసాగిస్తున్న బిజెపి నాయకత్వం, ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగే వ్యూహానికి పదునుపెడుతున్నట్లు సమాచారం. ఒకవైపు అధినాయకత్వ స్థాయిలో టిడిపితో సఖ్యతగా వ్యవహరిస్తోన్న బిజెపి, మరోవైపు రాష్ట్రంలో సొంతంగా ఎదిగే ప్రణాళిక రూపొందిస్తోంది. మనమే అధికారంలోకి వచ్చేలా పనిచేయండి.. బూత్‌కు పదిమందిని చేర్పించడమే పనిగా పెట్టుకోండి.. మీ రాష్ట్రంలో పార్టీ ఎలా అధికారంలోకి రాదో చూస్తానని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర నాయకులకు పదే పదే చెబుతున్నారు. తనను కలసినప్పుడు, రాష్ట్రానికి వచ్చినప్పుడు నిర్వహించే అంతర్గత సమావేశాల్లోనూ అమిత్‌షా ఇదే విధంగా దిశానిర్దేశం చేస్తుండటం బట్టి, ఆ పార్టీ రాష్ట్రంలో ద్విముఖ రాజకీయ వ్యూహంతో వెళుతున్నట్లు స్పష్టమవుతోంది. రాష్టప్రతి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో, రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
కాగా బిజెపి రాష్ట్రంలో సొంతంగా ఎదగాలని కోరుకుంటున్న ఒక వర్గం, ఇప్పటికే ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి స్వరం పెంచుతోంది. కేంద్రం ఇచ్చిన హామీల గురించి పదే పదే ప్రస్తావిస్తూ, తెలుగుదేశం పార్టీ తమను ప్రజల్లో అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నాలు చేస్తోందని గ్రహించిన బిజెపి, అదే శైలిలో ఎదురుదాడికి తెరలేపటం ఆసక్తికరంగా మారింది. మద్యం అమ్మకాలు, ఇసుక మాఫియా వల్ల రాష్ట్ర ఖజానాకు జరుగుతున్న నష్టం, ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతిపై ఆ పార్టీ ఎమ్మెల్సీ, జాతీయ కార్యవర్గసభ్యుడైన సోము వీర్రాజు తరచూ గళమెత్తుతున్నారు. ఆయన ఇటీవలి కాలంలో చేస్తున్న జిల్లా పర్యటనలకు స్పందన లభిస్తోంది. ప్రజా సమస్యలపై ఆయన తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగలేఖ రాస్తున్నారు. రెండురోజుల క్రితం బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి ఎన్నికల ముందు బాబు ఇచ్చిన హామీలను గుర్తు చేసి, వాటిని అమలుచేయాలని డిమాండ్ చేసి, కేంద్రంపై తెలుగుదేశం చేస్తున్న ఒత్తిళ్లకు సమాధానంగా తామూ అదే పంథా కొనసాగిస్తామన్న సంకేతాలు పంపారు. అంతకుముందు బిజెవైఎం రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. బిజెపి రాష్ట్ర సంఘటనా కార్యదర్శి జి రవీంద్రరాజు, బిజెవైఎం ఏపి ఇన్చార్జి ఎస్‌వి రాఘవేంద్ర, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆడారి కిశోర్‌కుమార్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. నిరుద్యోగులకు బాబు ఇస్తానన్న 2 వేల భృతి, ఖాళీ పోస్టుల భర్తీ, కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన పర్మినెంట్ హామీ నిలబెట్టుకోవాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం హోంగార్డులకు సవరించిన మాదిరిగానే ఇక్కడా 30 వేల వరకూ జీతభత్యాలు పెంచాలని , నిరుద్యోగుల వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేసింది.
తాజాగా కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న ఇసుక మాఫియాను ప్రస్తావించి సర్కారును ఇరుకునపెట్టారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు తనకు తెలియవని చంద్రబాబు చెప్పడం సరికాదని, ఇసుక మాఫియాలో ప్రజాప్రతినిధులుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఓవైపు ఉచిత ఇసుక అంటూ మరోవైపు లారీలతో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించటం ద్వారా ఈ వ్యవహారం అంతా టిడిపి దన్నుతోనే జరుగుతోందన్న సంకేతాలిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివే అయినా, రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రచారం చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర బిజెపిలో తెలుగుదేశం, ఆ పార్టీతో సన్నిహితంగా వ్యవహరించే ఓ కేంద్రమంత్రికి వ్యతిరేకవర్గం బలం పుంజుకోవడంతో, సొంతంగా ఎదగాలన్న నినాదం ఊపందుకున్నట్టు కనిపిస్తోంది.